జగపతిని కన్ఫర్మ్ చేయలేదట!

మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తోన్న ‘కత్తి’ సినిమా రీమేక్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడని కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం ఎంతుందనే విషయం మాత్రం తెలియదు. నటుడు జగపతిబాబు స్వయంగా ఈ విషయంపై స్పందించారు. నన్ను విలన్ కోసం సంప్రదించిన మాట వాస్తవమే..

కానీ నన్ను విలన్ గా కన్ఫర్మ్ మాత్రం చేయలేదని చెప్పారు. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న జగపతిని చిరు సినిమాలో ఎప్పటినుండి పాల్గొంటారని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. అసలు జగపతిబాబుని తీసుకునే ఆలోచన ఉందా..? లేక వేరెవరినైనా తీసుకుంటారా..? అనే విషయం తెలియాల్సివుంది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus