బాలయ్యకు ‘నటించడం’ రాదు – జగపతి బాబు

  • March 25, 2016 / 02:08 PM IST

జగపతి బాబు…హ్యాండ్‌సమ్ హీరోగా టాలీవుడ్ లో చక్రం తిప్పిన ఈ హీరో కమ్ విలన్. ఇప్పడు ఇండస్ట్రీ లో విలన్ గా, ఫాదర్ గా, స్పెషల్ పాత్రల్లో దూసుకుపోతున్నాడు. అయితే బాలయ్య పుణ్యమా అంటూ లెజెండ్ సినిమాతో మళ్ళీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జగ్గు భాయ్…తాజాగా ఒక ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యపై సంచలన కామెంట్స్ చేశాడు. బాలయ్య చాలా మంచి మనిషి అని, ముక్కుసూటిగా తన మనసులో ఏముందో అదే మాట్లాడుతాడు అని, అంతేకాని చాలామందిలాగా బాలయ్యకు నిజజీవితంలో నటించడం రాదు అని బాలయ్యపై తన అభిమానాన్ని మరోసారి చూపించాడు. అదే క్రమంలో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ పై సైతం జగపతి కాస్త ఎమోషనల్ గా మాట్లాడినట్లు తెలుస్తుంది. వారి గురించి మాట్లాడుతూ నేటి తరం ఆర్టిస్టులలో ప్రకాష్ రాజ్ నెంబర్ వన్ అని అంటూ ఆ తరువాత స్థానంలో రాజేంద్రప్రసాద్, రావ్ రమేష్, పోసాని కృష్ణమురళీ ప్రధమ స్థానంలో ఉంటారని చెబుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ఎవరి స్థానం వాళ్ళకి ఉంటుంది అని, ఎంత మంది ఉన్నా…ఎంత గొప్ప ఆర్టిస్టులు అయినా తన స్థానం తనకు ఉందని తాను ఎవ్వరి గురించి బెదిరి పోవలసిన అవసరం లేదని తన స్థానంపై సంచలన కామెంట్స్ చేశాడు. ఇక అక్కడితో ఆగకుండా కులంపై కూడా కాస్త ఘాటుగానే స్పందించాడు జగపతి. కులం గురించి మాట్లాడే క్రమంలో…తాను కమ్మ కులంలో పుట్టినా కమ్మవాళ్ళ గొప్పతనం ఏమిటో తనకు ఇప్పటికీ అర్ధం కాదు అని తెలుపుతూనే….కులం పేరిట జరిగే ఫంక్షన్స్ ను, వనభోజనాలను చూస్తూ ఉంటే మన సమాజం ఎప్పటికీ ఇంతేనా అన్న బాధ కలుగుతూ ఉంటుంది అని తెలిపాడు. ఇలా ముక్కుసూటిగా, తనకు నచ్చిన విధానంలో మనసు విప్పి మాట్లాడాడు మన జగ్గు భాయ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus