ప్రీమియర్ షోలతో భారీ కలక్షన్స్ సాధించిన జై లవకుశ!

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి చేసిన జై లవకుశ మూవీ నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ సొంతం చేసుకుంది. మూడు క్యారెక్టర్లో తారక్ నటనకు అందరూ జేజేలు పలుకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. సినిమా గురువారం రిలీజ్ అవ్వగా, బుధవారం రాత్రి 159 స్క్రీన్స్ లో ప్రీమియర్ షోలను వేశారు. తక్కువ స్క్రీన్ లలో షో వేసినప్పటికీ జై లవకుశ $ 539000 లను రాబట్టి ఎన్టీఆర్ సత్తాని చాటింది. ఇప్పటివరకు అమెరికాలో ప్రీమియర్ షోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో జై లవకుశ 7వ స్థానంలో నిలిచింది.

అమెరికా ప్రీమియర్ షోల్లో టాప్ టెన్ కలెక్షన్స్.. డాలర్లలో

బాహుబలి 2 : $4517704
బాహుబలి 1 : $1364416
ఖైదీ నెంబర్ 150 : $1295613
సర్డార్ గబ్బర్ సింగ్ : $616054
జనతా గ్యారేజ్ : $584255
బ్రహ్మోత్సవం : $560274
జై లవకుశ : $539000
దువ్వాడ జగన్నాథమ్ : $538011
శ్రీమంతడు : $535984
ఆగడు : $523613

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus