సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు ₹600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్ 2′(Jailer 2) రాబోతున్న సంగతి తెలిసిందే. విద్యాబాలన్, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ అతిథి పాత్రలు పోషించారు.
సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది.అయితే ‘జైలర్ 2’ ప్రమోషనల్ కంటెంట్‌కు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయినప్పటికీ.. సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ కావడం వల్ల ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ ఏర్పడింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. 2వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 7.25 కోట్లు |
| సీడెడ్ | 1.92 కోట్లు |
| ఆంధ్ర(టోటల్) | 5.85 కోట్లు |
| ఏపీ +తెలంగాణా(టోటల్) | 15.02 కోట్లు |
| తమిళనాడు | 20 కోట్లు |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 22 కోట్లు |
| ఓవర్సీస్ | 43.5 కోట్లు |
| ఓవర్సీస్ | 100.52 కోట్లు (షేర్) |
‘జైలర్ 2’ సినిమాకి రూ.281.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.285 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.36.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.37 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
అయితే 2 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.100.52 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. గ్రాస్ పరంగా రూ.200 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.180.98 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే 2 రోజుల్లో రూ.15.02 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.21.98 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.