సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు ₹600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్ 2′(Jailer 2) రాబోతున్న సంగతి తెలిసిందే. విద్యాబాలన్, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ అతిథి పాత్రలు పోషించారు.
సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది.అయితే ‘జైలర్ 2’ ప్రమోషనల్ కంటెంట్‌కు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయినప్పటికీ.. ఇది సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ కావడం వల్ల భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘జైలర్ 2’ థియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 4.5 కోట్లు |
| సీడెడ్ | 1.25 కోట్లు |
| ఆంధ్ర(టోటల్) | 4.2 కోట్లు |
| ఏపీ +తెలంగాణా(టోటల్) | 9.95 కోట్లు |
| తమిళనాడు | 12 కోట్లు |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 13.5 కోట్లు |
| ఓవర్సీస్ | 25.4 కోట్లు |
| ఓవర్సీస్ | 60.85 కోట్లు (షేర్) |
‘జైలర్ 2’ సినిమాకి రూ.281.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.285 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.36.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.37 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
అయితే మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.60.85 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. గ్రాస్ పరంగా రూ.120 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.224.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు రూ.9.95 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.27.05 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.