Jailer 2: అమీర్ వల్ల కాలేదు.. షారుఖ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?

తమిళ సినిమా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాలని గట్టిగా ట్రై చేస్తోంది. మొన్నామధ్య లోకేష్ కనగరాజ్, రజినీకాంత్ కాంబోలో వచ్చిన ‘కూలీ’ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. అందులో అమీర్ ఖాన్ స్పెషల్ రోల్ చేసినా కూడా, అది సినిమాకు పెద్దగా ప్లస్ అవ్వలేదనేది చేదు నిజం. ఇప్పుడు అందరి కళ్ళు ‘జైలర్ 2’ మీదే ఉన్నాయి.

Jailer 2

నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన ‘జైలర్’ మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర 800 కోట్ల మార్క్ టచ్ చేసి సత్తా చాటింది. ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తోంది కాబట్టి అంచనాలు డబుల్ అయ్యాయి. ఈసారి ఎలాగైనా వెయ్యి కోట్ల మార్క్ దాటించాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. అందుకే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను రంగంలోకి దింపుతున్నారు.

అయితే ఇక్కడ ఒక భయం కూడా ఉంది. కూలీ సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర సరిగా పండలేదు. కేవలం పరభాషా నటులను ఇరికించినంత మాత్రాన కలెక్షన్లు రావని ఆ సినిమా నిరూపించింది. మరి నెల్సన్ ఆ తప్పు చేయకుండా, షారుఖ్ పాత్రను కథలో బలంగా రాసుకుంటేనే హిందీలో వర్కవుట్ అవుతుంది. వెయ్యి కోట్లు రావాలంటే నార్త్ ఆడియన్స్ సపోర్ట్ చాలా ముఖ్యం.

షారుఖ్ ఉండటం వల్ల సినిమాకు బాలీవుడ్ లో ఆటోమేటిక్ గా హైప్ వస్తుంది. కానీ అది సినిమా రిజల్ట్ ని మార్చేలా ఉండాలి. రజినీ మాస్ ఇమేజ్, షారుఖ్ స్టార్ డమ్ సరిగ్గా బ్లెండ్ అయితే కోలీవుడ్ కు మొదటి వెయ్యి కోట్ల సినిమా దొరికినట్లే. అమీర్ చేయలేని మ్యాజిక్ ని షారుఖ్ చేసి చూపిస్తాడో లేదో చూడాలి. రజినీ ఫ్యాన్స్ మాత్రం ఈసారి రికార్డుల మోత మోగాల్సిందే అని ఫిక్స్ అయ్యారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus