Jailer Movie: కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ ను కొల్లగొట్టనున్న జైలర్ !

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నట్టించిన లేటెస్ట్ చిత్రం ‘జైలర్’ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటు తమిళం లోను ఇటు తెలుగులోనూ ఈ సినిమా రికార్డ్స్ కి కేంద్ర బిందువుగా మారింది. నిన్న మొన్నటి వరకు అజిత్ , విజయ్ రికార్డ్స్ ని రజినీకాంత్ అందుకోలేకపోతున్నాడు అని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ ఒక రేంజ్ లో కామెంట్స్ చేసేవాళ్ళు. రజినీకాంత్ అభిమానులు అవన్నీ విని సహనం తో ఉండేవారు, మా టైం వచ్చినప్పుడు సత్తా చూపిస్తాము అనేవారు.

అయితే ఫ్యాన్స్ చెప్పినట్టు గానే వాళ్ళ సత్తా చూపించారు. ఈ సినిమా విడుదలై నేటికీ ఆరు రోజులు అయ్యింది. ఈ ఆరు రోజుల్లో అజిత్, విజయ్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ ని దాటడమే కాకుండా, గత ఏడాది విడుదలైన కమల్ హాసన్ విక్రమ్ సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ ని కూడా వారం రోజుల ముందే దాటేసింది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆరు రోజులకు కలిపి 450 కోట్ల రూపాయిల వసూళ్లను సాధించిందని చెప్తున్నారు.

హిందీ మార్కెట్ లేకుండా కేవలం సౌత్ మార్కెట్ తో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన సినిమా మరొకటి లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఆర్. ఆర్. ఆర్ మరియు కేజీఎఫ్ సిరీస్ కూడా సౌత్ మార్కెట్ లో 400 కోట్ల రూపాయిల కంటే తక్కువ గ్రాస్ వసూళ్లు మొదటి వారం లో రాబట్టాయని, కానీ జైలర్ సినిమా (Jailer Movie) అంతకు మించి వసూళ్లను రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది అంటూ చెప్పుకొచ్చారు.

మళ్ళీ ఈ రికార్డు ని బ్రేక్ చేసే సత్తా సౌత్ లో రజినీకాంత్ కి మాత్రమే ఉందని, ఆయనతో పాటుగా సలార్, పుష్ప 2 మరియు OG వంటి చిత్రాలకు కూడా ఆ ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఈ రికార్డ్స్ ని ఎవరు బ్రేక్ చేయబోతున్నారో చూడాలి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus