సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’. ‘వరుణ్ డాక్టర్’ ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత అయిన సునీల్ నారంగ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు కలిసి రిలీజ్ చేశారు.
ఇక ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ రావడంతో ‘జైలర్’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఆగస్టు 10 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ గమనిస్తే :
నైజాం | 3.18 cr |
సీడెడ్ | 0.92 cr |
ఉత్తరాంధ్ర | 0.80 cr |
ఈస్ట్ | 0.40 cr |
వెస్ట్ | 0.33 cr |
గుంటూరు | 0.62 cr |
కృష్ణా | 0.42 cr |
నెల్లూరు | 0.21 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.88 cr |
‘జైలర్’ (Jailer) చిత్రానికి తెలుగులో రూ.11.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.12.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి రోజు ఈ చిత్రం రూ.6.88 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.5.62 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!