Jailer: ‘జైలర్‌’తో రజనీకాంత్‌ రికార్డుల వేట… హుకుం జారీ చేస్తే ఇలానే ఉంటుందిగా…

రజనీకాంత్‌ ఓ సినిమా మనసు పెట్టి చేస్తే, దర్శకుడు ప్రాణం పెట్టి సినిమాను తెరకెక్కిస్తే.. ఆ సినిమా విజయాన్ని, అది అందించే వసూళ్ల ప్రవాహాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. వసూళ్లను లెక్కలను చూడటానికి కొత్తగా కొంతమందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిందే అంటుంటారు. అచ్చంగా ఈ మాటను నిజం చేస్తూ ఇప్పుడు ‘జైలర్‌’ సినిమా వచ్చింది. ఈ సినిమాకు ఇప్పటివరకు రూ. 600 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా అరుదైన రికార్డు అందుకుంది.

రజనీకాంత్‌ – నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం (Jailer) ‘జైలర్‌’. తొలుత దేశంలో ఆ తర్వాత విదేశాల్లో విడుదలవుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మలేషియాలో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన ఇండియన్‌ సినిమా సత్తా చాటింది. అయ్యంగరన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ సినిమాను మలేసియాలో విడుదల చేసింది. ఈ సినిమా విజయాన్ని వివరిస్తూ ఆ టీమ్‌ సోషల్‌ మీడియాలో ఈ విషయాలను వెల్లడించింది. గతంలో ఏ సినిమాకు రికార్డు ఉంది అనేది కూడా చెప్పారు.

మలేసియాలో ఆ రికార్డు ఇప్పటివరకు షారుఖ్‌ ఖాన్‌ సినిమాకు ఉండేది. 2015లో షారుఖ్‌ నుండి వచ్చిన ‘దిల్‌వాలే’ సినిమానే ఇప్పటివరకు తొలి స్థానంలో ఉంది. తాజాగా రజనీకాంత్‌ ‘జైలర్‌’ సినిమాతో ఆ రికార్డును తిరగరాశాడు. అయితే, ఈ సినిమా ఎంత వసూలు చేసింది అనేది మాత్రం చెప్పలేదు. మరోవైపు మలేషియా ప్రధానిని రజనీకాంత్ ఇటీవల కలిశారు. మామూలుగానే రజనీ సినిమాలకు మలేసియాలో మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి నిరూపితమైంది.

అయితే ఇక్కడే మరో విషయం. మలేసియా కంటే రజనీ సినిమాలకు జపాన్‌లో ఆదరణ ఎక్కువ. దీంతో ఈ సినిమాను జపాన్‌లో రిలీజ్‌ చేస్తే పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఫ్లాప్‌ సినిమాలను అక్కడ మళ్లీ మళ్లీ చూస్తారు అని టాక్‌. మరి ఈ బ్లాక్‌బస్టర్‌ హుకుంకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus