‘జైత్ర యాత్ర’ మూవీ నుండి మూడో పాటని లాంచ్ చేసిన ‘విరాటపర్వం’ దర్శకుడు వేణు ఉడుగుల

అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌ నిర్మిస్తున్న చిత్రం `జైత్ర‌`. స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత‌. షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లై మంచి రెస్పాన్స్ లభించింది.

రాయలసీమ స్లాంగ్ , నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా మట్టితో చుట్టరికం చేసే ఒక రైతు కథను అందంగా తెరకెక్కించడం జరిగింది.

తాజాగా ఈ సినిమా నుండి మూడో లిరికల్ సాంగ్ సందమామయ్యాలో ను దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు.

ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ…జైత్ర సినిమా ఒక రైతు కథతో చాలా సహజంగా మంచి స్లాంగ్ తో రాబోతోంది. ఈ మూవీ సాంగ్స్ టీజర్ బాగున్నాయి. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు. సందమామయ్యాలో సాంగ్ చాలా బాగుంది, ఫణి కళ్యాణ్ సంగీతం బాగుంది. దర్శకుడు మల్లికార్జున్ తోట, నిర్మాత అల్లం సుభాష్ కు జైత్ర సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్న అక్టోబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus