సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న. ఇటీవలే ఈ చిత్రానికి సంభందించి మెదటి లుక్ టీజర్ ని విడుదల చేయటం జరిగింది. విడుదలయ్యిన మెదటిరోజునే 100000 వీవ్స్ రావటం ఈ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలు ఏరేంజిలో వున్నాయో తెలుస్తుంది. సునీల్ బ్యాక్ టు ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ విడుదల చేసిన ఈ టీజర్ లో చివరి పంచ్ సోషల్ మీడియాలో వివరీతంగా వైరల్ కావటం విశేషం. ఇలాంటి పంచ్ డైలాగ్స్ ఈచిత్రంలో చాలా వున్నాయి. రక్ష చిత్రం దర్శకుడు వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. దినేష్ అందించిన ఆడియోని ఈనెల 24 న అభిమానులు, ప్రేక్షకుల మరియు సినిపెద్దల సమక్షంలో విడుదల చేస్తున్నారు.
నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ…… సునీల్ గారు నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మా జక్కన్న చిత్రం. సునీల్ పెర్ ఫార్మెన్స్ లో అన్ని రకాల షెడ్స్ వుంటాయి. సునీల్ గారి కామెడి టైమింగ్ కి డైరక్టర్ వంశి రాసిన సీన్ కి ధియోటర్స్ లో క్లాప్స్ పడతాయి. దీనికి ఉదాహరణ రీసెంట్ గా రిలీజయ్యిన టీజర్ లొ చివరి పంచ్ గురించి మాకు వస్తున్న కాల్స్. అంతగా మా టీజర్ ప్రేక్షకుల్లో కి వెల్లిపోయింది. అదే విధంగా దినేష్ గారు అందిచిన ఆడియో కూడా ఫుల్ ఎనర్జిగా వుంటాయి. అన్ని పాటలు పాడుకునేలా వుంటాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. మా డైరెక్టర్ వంశీ కృష్ణ అకెళ్ళ ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. ప్రేమకథా చిత్రం తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ జక్కన్న చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మా చిత్రంలో ఊహించని ట్విస్ట్ లు చాలా వుంటాయి. హీరోయిన్ మన్నార్ చోప్రా పాత్ర కూడా చాలా అందంగా తీర్చిదిద్దాడు మా దర్శకుడు. అలాగే మా చిత్రం ప్రేమకథా చిత్రం లో సప్తగిరి ఏ రేంజిలో నవ్వించాడో ఈ చిత్రంలో దాన్ని మించి నవ్విస్తాడు. సప్తగిరి మంచి గెటప్ లో కనిపిస్తాడు. ఆడయోని 24 న విడుదల చేస్తున్నాము. చిత్రాన్ని జులై లో విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము. అని అన్నారు.
నటీనటులు
సునీల్, మన్నార్ చోప్రా, కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్రభాస్ శీను, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, ఉదయ్, ఆనంద్ రాజ్, సత్య, వైవా హర్ష, వేణుగోపాల్, రాజశ్రీ నాయర్ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ – ఆర్ పి ఏ క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్,
మ్యూజిక్: దినేష్,
ఆర్ట్ డైరెక్టర్ – మురళి,
ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్,
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ,
డైలాగ్స్: భవాని ప్రసాద్,
స్టిల్స్ – వాసు
పిఆర్ఓ – ఏలూరు శ్రీను
కో ప్రొడ్యూసర్స్: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి,
నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ.