‘ఖుషి’ (Kushi) తర్వాత పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) వరుస ప్లాపులు పడ్డాయి. 2001 నుండి 2007 వరకు పవన్ కళ్యాణ్ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. అలాంటి టైంలో త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ‘జల్సా’ (Jalsa) అనే సినిమా చేశాడు పవన్ కళ్యాణ్. 2008వ ఏప్రిల్ 2న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదట్లో కొంత మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ… కామెడీ వర్కౌట్ అవ్వడం అలాగే సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ కూడా కలిసి రావడంతో సినిమా బాగానే నిలబడింది.
‘సంజయ్ సాహు అనే కుర్రాడు జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను’ త్రివిక్రమ్ తన స్టైల్లో ప్రెజెంట్ చేశారు.’గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) నిర్మించారు.దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన పాటలు…. మహేష్ బాబు వాయిస్ ఓవర్.. ఈ సినిమాకి మరింత ఆకర్షణగా నిలిచాయి. నేటితో ‘జల్సా’ రిలీజ్ అయ్యి 17 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ క్రమంలో ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి:
నైజాం | 9.35 cr |
సీడెడ్ | 4.50 cr |
ఉత్తరాంధ్ర | 2.85 cr |
ఈస్ట్ | 2.00 cr |
వెస్ట్ | 1.80 cr |
గుంటూరు | 2.05 cr |
కృష్ణా | 1.80 cr |
నెల్లూరు | 1.05 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 25.54 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.50 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 28.90 cr (షేర్) |
‘జల్సా’ (Jalsa) చిత్రం రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. సమ్మర్ హాలిడేస్ కలిసి రావడంతో ఫుల్ రన్లో ఏకంగా రూ.28.9 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. బయ్యర్స్ కి ఈ సినిమా రూ.3.9 కోట్ల లాభాలు అందించింది. ‘జల్సా’ ఆడియో సేల్స్ కూడా అప్పట్లో పెద్ద రికార్డు క్రియేట్ చేశాయి అని చెప్పాలి.