జనతా గ్యారేజ్…రికార్డుల ప్రకంపనలు!!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ‘జనతా గ్యారేజ్’ దూకుడు బాక్స్ ఆఫీస్ వద్ద స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న సెప్టెంబర్1న గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి ఆట నుంచి కాస్తంత మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ…క్రమక్రమంగా దూసుకుపోతుంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా ఈ వీకెండ్ మొత్తానికి కలుపుకుని మొత్తానికి దాదాపుగా 40కోట్ల కలెక్షన్స్ ను దాటేసి రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఇక అదే క్రమంలో వచ్చే రెండు మూడు వారాల వరకూ పెద్ద సినిమాలు లేకపోవడం, జనతా ఒక్కటే బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడంతో తధ్యంగా కనిపించడంతో మొత్తంగా ఈ సినిమా రానున్న రోజులు 100కోట్ల కలెక్షన్స్ ను సాధించి టాలీవుడ్ సినిమా చరిత్రలోనే కాదు, ఎన్టీఆర్ కరీర్ లో కూడా బెస్ట్ సినిమాగా నిలబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా మాస్ హీరోగా ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు, అయితే ఈ సినిమా ఎన్టీఆర్ కాస్త క్లాస్ టచ్ కూడా ఇవ్వడంతో అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మ రధం పడుతున్నారు. మరో పక్క మోహన్ లాల్ యాక్టింగ్ కి సైతం ఫిదా అయిపోయారు మన తెలుగు ప్రేక్షకులు. మొత్తానికి అటు చేసి చేసి…..కాస్త మిక్స్డ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి మొదలు పెట్టిన జనతా…టాలీవుడ్ రికార్డుల ప్రకంపనలు సృష్టించే దిశగా దూసుకుపోతుంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus