“ఎన్టీఆర్” పై నమ్మకంతో….

ఎన్టీఆర్ టెంపర్ నాన్నకు ప్రేమతో సినిమాతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఇదే క్రమంలో జనతా గ్యారేజ్ ను కూడా చాలా పగడ్బంధీగా చేస్తున్నాడు. అయితే అదే క్రమంలో ఈ సినిమాకు సంభందించి ఒక ప్రముఖ నిర్మాత చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో హాట్ హాట్ టాపిక్ గా మారడంతో ఇప్పుడు అందరూ వాటి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే…టాలీవుడ్ బడా నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు, ఆ మధ్య కొన్ని చిన్న చిన్న దెబ్బలు తిన్నా…తాజాగా తాను కొన్న “అ..ఆ” తో భారీ లాభాలనే చవి చూసాడు. ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

అదే ఆనందాన్ని మీడియాతో పంచుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలిపాడు. ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ఇచ్చింది అని, వరుస పరాజయాలతో కాస్త వెనకడుగు వేసినట్లు అనిపించినా మళ్లీ నిలదొక్కుకునేందుకు ఈ సినిమా మంచి అవకాశం అని చెబుతుంటే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు…. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాను తాను భారీ రైట్స్ కొన్నాను అని, ఎందుకంటే ఎన్టీఆర్ గత చిత్రం నాన్నకు ప్రేమతో భారీ హిట్ అవడమే కాకుండా, దర్శకుడు కొరటాల కూడా “శ్రీమంతుడు” సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.

అందుకే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు దాదాపుగా నైజామ్ రైట్స్ ను 17కోట్లకు కొన్నట్లు దిల్ రాజు తెలిపాడు. అయితే అదే క్రమంలో ఎన్టీఆర్ గత సినిమా నాన్నకు ప్రేమతో 14కోట్లకు అమ్ముడుపోయింది. మరి ఎన్టీఆర్ పై నమ్మకంతో రాజు గారు…భారీ రిస్క్ చేస్తున్నట్లు అనిపించినా సినిమా అరిపిస్తే….రాజు గారి పంట పండినట్లే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus