సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ విడుదల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘జనతా గ్యారేజ్’ . ఎన్టీఆర్ సరసన సమాంతా, నిత్యా మీనన్ లు కథానాయికలు గా కనిపిస్తారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేసేందుకు సిద్ధ పడుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తొలుత ఆగస్ట్ 12 న విడుదల చెయ్యాలి అని భావించినప్పటికీ, నాణ్యమైన చిత్రాన్ని అందించటం కోసం మరొక మూడు వారాల గడువు తీసుకుంటున్నట్లు గా దర్శకులు కొరటాల శివ తెలిపారు. ఆగస్ట్ లో చిత్రం ఆడియో ఉంటుంది అని అన్నారు.

దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ : “అభిమానులు ఆగస్ట్ 12 న విడుదల చేయట్లేదని కొంత నిరాశ చెందుతారు. వారికి క్షమాపణలు తెలుపుతున్నాము. ఉత్తమ చిత్రాన్ని అందించటం కోసం, అందుకు పోస్ట్ ప్రొడక్షన్ లో తగిన సమయం కేటాయించటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాము. చిత్రం అద్భుతం గా వచ్చింది. మంచి స్పాన్ ఉన్న చక్కటి కథ. ఎన్టీఆర్ అద్భుతం గా చేశారు. అటువంటి చిత్రానికి సాంకేతిక పరం గా లోటు ఉండకూడదు. కొంచెం లేట్ అయినా అద్భుతమైన ఔట్పుట్ తో వస్తాము “, అని తెలిపారు

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C.V. M.) లు మాట్లాడుతూ : “మరొక పది రోజుల షూటింగ్ ఉంది. వర్షాల కారణం గా షూటింగ్ కి అప్పుడప్పుడు అంతరాయం కలగటం తో, పోస్ట్ ప్రొడక్షన్ కి సమయం తగ్గింది. టీజర్ తో, ఫస్ట్ లూక్ తో చిత్రానికి భారీ గా అంచనాలు పెరిగాయి. అభిమానుల కు, ప్రేక్షకుల కు మంచి చిత్రం అందించాలి అనే ఒకే ఒక కారణం తో ఈ చిత్రం విడుదల ను సెప్టెంబర్ కు వాయిదా వేస్తున్నాము. ” అని తెలిపారు.

సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్, గుణాజీ ,సితార, దేవయాని వంటి ప్రఖ్యాత నటులు ఈ చిత్రం లో ముఖ్య పత్రాలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి – తిరు . ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ – ఎ. ఎస్. ప్రకాష్. ఫైట్స్ – ఆణల్ అరసు. సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ . ఎక్సిక్యుటివ్ ప్రొడ్యూసర్ – చంద్రశేఖర్ రావిపాటి . నిర్మాతలు – నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C. V. M.) రచన – దర్శకత్వం – కొరటాల శివ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus