సినిమా పరిశ్రమలో కొత్త నటుడి, బ్యాగ్రౌండ్ లేని నటుడు వచ్చి ఓ భారీ విజయం అందుకున్నా, భారీ అంచనాలతో వచ్చి ఇబ్బందికర ఫలితం అందుకున్నా ఓ టాపిక్ బయటకు వస్తుంది. అదే నెపోటిజం. అప్పటివరకు ఎక్కడో దాక్కుతున్న ఈ టాపిక్ బయటకు వస్తుంది. నాన్ సినిమా బ్యాగ్రౌండ్ నటుడి సినిమా హిట్ అయితే.. నెపోటిజం లేని హీరో అంటూ పొగిడేస్తారు. ఒకవేళ ఆ సినిమా విజయం సాధింకపోతే ‘ఇక్కడ నెపో కిడ్స్‌కే లైఫ్’ అంటూ విమర్శిస్తారు. అయితే నెపో కిడ్స్ కష్టాలను ఎవరూ పట్టించుకోరు అనే చర్చ ఒకటి ఉంది.
వారసత్వం హీరోలు, హీరోయిన్లకు తొలి సినిమా వరకు సులభంగా ఉంటుంది కానీ.. ఆ లెగసీని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లలేక ఇబ్బందిపడి తమ ప్రయాణం మధ్యలోనే ఆపేస్తున్నారు చాలామంది. టాలీవుడ్‌లోనే ఇలాంటి వారు చాలా మంది కనిపస్తారు. ఇలాంటి చర్చ జరుగుతున్న ఈ సమయంలో స్టార్ హీరోయిన్, నెపో కిడ్ అయిన జాన్వీ కపూర్ ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. ఇండస్ట్రీ బయట వ్యక్తుల కష్టాలు వినడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. ఇండస్ట్రీకి చెందినవారు ఇబ్బందులు పడుతున్నామంటే ఎవరూ వినరని అంది.
సినిమా పరిశ్రమలో ‘ఇన్‌సైడర్ vs అవుట్‌సైడర్’ అనే అంశంపై చర్చలో పాల్గొన్న జాన్వీ కపూర్ నటీనటులను బయట వ్యక్తులు, సినీ పరిశ్రమకు చెందినవారు అని విభజించడం ఇష్టం లేదని కామెంట్ చేసింది. బయట నుండి పరిశ్రమకు వచ్చినవారితో ఇండస్ట్రీలో ఉన్న వారి వారసుల కష్టాలను పోల్చడం సరికాదన్నారు. స్టార్ కిడ్స్ ఇబ్బందులు చెప్పినా విడ్డూరంగా అనిపిస్తుందంటారని.. కొంతమందైతే వినడానికి కూడా ఆసక్తి చూపించరు అని రియాలిటీ మాట్లాడింది జాన్వీ.
సినిమా పరిశ్రమలో స్టార్ కిడ్స్ ఎవరూ దతాము కష్టాలు పడ్డామని చెప్పరని, ఎందుకంటే బయటి వారితో పోల్చితే వారికి లభించిన సౌకర్యాల విషయంలో కృతజ్ఞతతో ఉండటమే అన్నారు. అంతేకానీ వారికి కష్టాలు ఉండవు అని అనుకోవద్దు అని జాన్వీ అంది. మరి ఇప్పుడైనా ఆమె మాటల్ని ఎవరైనా పట్టించుకుంటారా?