తెలుగు సినిమాకి ఈ ఏడాది శుభారంభం దొరకలేదు

2018 సంవత్సరంలో సక్సెస్ రేట్ పెద్దగా లేకపోయినా.. చరిత్ర సృష్టించిన సినిమాలు ఎక్కువగా విడుదలవ్వడంతో తెలుగు సినిమా స్థాయి పెరగడం, మార్కెట్ పరిధి పెరగడం వంటి కారణాలుగా సక్సెస్ రేట్ ను పెద్దగా పట్టించుకోలేదు. సో, 2019 మన తెలుగు ఇండస్ట్రీకి బాగా పనికొస్తుంది అనుకున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అందులోనూ సంక్రాంతికి పోటీపడిన సినిమాల లిస్ట్ చూసి ఇండస్ట్రీకి శుభారంభం లభిస్తుంది అని ఫిక్స్ అయిపోయారు కూడా. కానీ.. లెక్క తప్పి సంక్రాంతికి విడుదలైన నాలుగు పెద్ద సినిమాల్లో ఒకటైన “వినయ విధేయ రామ” డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకోగా..

మరో చిత్రమైన “ఎన్టీఆర్ కథానాయకుడు” సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాబట్టలేక డిజాస్టర్ గా మిగిలిపోయింది. “ఎఫ్ 2” మాత్రం వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక గత శుక్రవారం విడుదలైన అఖిల్ “మిస్టర్ మజ్ను”కు కూడా యావరేజ్ టాక్ రావడంతో మినిమం కలెక్షన్స్ కూడా సాధించలేక చతికిలపడింది. సినిమా ప్రస్తుత కలెక్షన్స్ చూస్తుంటే.. ఇది అఖిల్ కి మరో డిజాస్టర్ అని డిక్లేర్ చేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ఈ విధంగా వరుసబెట్టి ఒకే నెలలో మూడు డిజాస్టర్లు వచ్చాయి మన తెలుగు సినిమాకి. మరి ఫిబ్రవరి ఎలా ఉంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus