Jawan: జవాన్ సినిమాకు నా వల్ల 2 కోట్లు నష్టం : బిగ్ బాస్ బ్యూటీ

రీసెంట్ గా విడుదలైన సినిమాలలో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’. ఏడాది ప్రారంభం లో ‘పఠాన్ ‘ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని వెయ్యి కోట్ల రూపాయిలను కొల్లగొట్టిన షారుఖ్ ఖాన్, ఇప్పుడు ఇదే ఏడాది లో ‘జవాన్’ సినిమాతో మరో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి, బాలీవుడ్ కి ఊపిరి పోసాడు. 1990 దశాబ్దం మరియు 2000 దశాబ్దం లో బాలీవుడ్ అంటే షారుఖ్ ఖాన్ అన్నట్టుగా ఉండేది.

ఎంతమంది హీరోలు ఉన్నా, ఆయన మేనియా ముందు నిలబడలేకపొయ్యేవారు. గత దశాబ్దం ఆయనకీ పెద్దగా కలిసి రాలేదు కానీ, ఈ దశాబ్దం మాత్రం షారుఖ్ ఖాన్ కి పూర్వ వైభవం తీసుకొచ్చింది. ఇకపోతే షారుఖ్ ఖాన్ ని దగ్గర నుండి చూస్తే చాలు అని అనుకునే వారిలో ఒకరు బిగ్ బాస్ సిరి. అలాంటిది ఆమె ఏకంగా ‘జవాన్‘ చిత్రం లో షారుఖ్ ఖాన్ తో కలిసి నటించింది. యూట్యూబ్ లో సాధారణ షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే స్థాయి నుండి షారుఖ్ ఖాన్ సినిమాలో నటించే స్థాయికి వెళ్లడం అనేది మామూలు విషయం కాదు.

ఈ సినిమాలో (Jawan) అవకాశం దక్కినప్పుడు రియాక్షన్ గురించి సిరి కొన్ని అనుభవాలను చెప్పుకొచ్చింది. అట్లీ గారు షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ అనే సినిమా తీస్తున్నారు. ఇందులో ఒక చిన్న పాత్ర ఉంది, మీరు చేస్తారా అని ఫోన్ వచ్చినప్పుడు ఎదో ప్రాంక్ కాల్ అని అనుకున్నాను, షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టేంత వరకు ఇది షారుఖ్ ఖాన్ సినిమా అని నమ్మలేదు అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఒక షాట్ లో నేను డైలాగ్ చెప్పడానికి 7 టేకులకు పైగా తీసుకున్నాను, షూటింగ్ ప్యాకప్ నావల్ల చాలా ఆలస్యం అయ్యింది.

దీంతో అట్లీ మరియు షారుఖ్ ఖాన్ ఇద్దరు నా మీద ఫైర్ అయ్యారు, నాకు చాలా ఏడుపు వచ్చేసింది అంటూ చెప్పుకొచ్చింది సిరి. ఆ రోజు ఈమె వల్ల నయనతార కాల్ షీట్ మిస్ అయ్యేదట, మళ్ళీ షూటింగ్ ఈరోజు కాకుండా వేరే రోజు పెట్టుకుంటే రెండు కోట్లు నష్టం, అందుకే సిరి మీద ఫైర్ అయ్యారట.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus