Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » “ప్రశంసలందుకొమ్మురా” అంటున్న డా.దాసరి !!

“ప్రశంసలందుకొమ్మురా” అంటున్న డా.దాసరి !!

  • December 5, 2016 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ప్రశంసలందుకొమ్మురా” అంటున్న డా.దాసరి !!

ఏదైనా ఓ సినిమా విజయం సాధిస్తే.. ఎక్కువగా ఆనందించేవారిలో దర్శకరత్న డా.దాసరి ఒకరు. ముఖ్యంగా ఓ చిన్న సినిమా పెద్ద విజయం సాధిస్తున్నప్పుడు దాసరి మరింతగా సంతోషిస్తారు. సదరు చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ అభినందనల వర్షం కురిపిస్తారు. దాసరి ప్రశంస ఓ “ఐ ఎస్ ఐ” మార్క్ లాంటిది. ఓ సినిమాను దాసరి ప్రత్యేకంగా ప్రశంసించారంటే.. ఆ సినిమా “కచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా” అని అందరూ ఫిక్సయిపోతారు.

“పెళ్ళిచూపులు” తర్వాత దర్శకరత్న డా.దాసరి అభినందనలందుకొన్న చిత్రం “జయమ్ము నిశ్చయమ్ము రా”. ఈ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన వేయించుకొని వీక్షించిన దాసరి- దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి, కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డిలను ఇంటికి పిలిపించుకొని మరీ మీడియా సమక్షంలో వాళ్ళను అభినందించారు.

సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత నుంచి సినిమాలో తనకు శ్రీనివాస్ రెడ్డి కనిపించడం మానేశాడని.. ఫస్టాఫ్ లో సర్వమంగళం, సెకండాఫ్ లో సర్వేష్ మాత్రమే కనిపించాడని దాసరి అన్నారు. రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ శివరాజ్ కనుమూరి- “జయమ్ము నిశ్చయమ్ము రా” చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతమని దర్శకరత్న కొనియాడారు. టాలీవుడ్ కు మరో మంచి దర్శకుడు దొరికినట్లేనని ఈ సందర్భంగా దాసరి అభిప్రాయపడ్డారు.

ఈ చిత్రం ద్వారా కృష్ణభగవాన్ కు మళ్ళీ మంచి గుర్తింపు వస్తుందని, పోసాని పోషించిన పంతులు పాత్ర తనకెంతగానో నచ్చిందని దాసరి పేర్కొన్నారు. హీరోహీరోయిన్ల పాత్రలతోపాటు- సినిమాలోని ప్రతి పాత్రను దర్శకుడు చూడముచ్చటగా తీర్చిదిద్దాడని దాసరి అన్నారు. ఇప్పటికే మంచి విజయం సాధిస్తున్న ఈ చిత్రం- మరింత పెద్ద విజయం సాధించాల్సిన అవసరం ఉందని దాసరి అన్నారు.
ఒక కమెడియన్ హీరోగా చేయడమనే ట్రెండ్ దాసరిగారితోనే మొదలైందని, ఘన విజయం సాధించిన దాసరి తొలి చిత్రం “తాత మనవడు” దర్శకుడిగా తనను ఎంతగానో ప్రభావితం చేసిన సినిమాల్లో ఒకటని దర్శకరత్న శివరాజ్ కనుమూరి అన్నారు.

దాసరి వంటి లెజండరీ డైరెక్టర్ ప్రత్యేకంగా పిలిపించుకొని ప్రశంసించడం జీవితాంతం గుర్తుంచుకొంటానని కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
సంచలనానికి పర్యాయపదంగా చెప్పుకొనే దాసరి వంటి ఆల్ రౌండర్ “జయమ్ము నిశ్చయమ్ము రా” చిత్రాన్ని ప్రశంసించడం ఓ పెద్ద అవార్డులా భావిస్తున్నామని ఈ చిత్రాన్ని ఉభయ రాష్ట్రాల్లో విడుదల చేసిన ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి అన్నారు!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayammu Nischayammu Raa
  • #Jayammu Nischayammu Raa movie
  • #Poorna
  • #Shamna Kasim
  • #Srinivas Reddy

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

2 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

17 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

1 day ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

1 day ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

1 day ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

1 day ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version