మహేష్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న సీనియర్ నటి జయసుధ..!

మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం పై భారీ అంచనాలెంతున్నాయో.. నెగెటివిటీ కూడా అంతే రేంజ్లో ఉంది. ‘మహర్షి’ చిత్ర యూనిట్… ఈ చిత్రం గురించి చెప్పే కబుర్లు ఆకాశమే హద్దుగా ఉంటున్నాయి.. కానీ అప్డేట్స్ మాత్రం చాలా నీరసంగా ఉంటున్నాయి. విడుదల చేస్తున్న లుక్ లు చూసి మహేష్ అభిమానులే తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సహజ నటి జయసుధ చేసిన కామెంట్లు మహేష్ అభిమానుల్ని తెగ టెన్షన్ పెడుతున్నాయట. అసలు విషయానికొస్తే ఈ చిత్రం గురించి జయసుధ మాట్లాడుతూ.. “మహర్షి చిత్రంలో మహేష్ బాబు నటన తారా స్థాయికి వెళ్లింది. రెండు మూడు సీన్స్ లో మహేష్ బాబుతో యాక్టింగ్ చేసే సమయంలో అతడి యాక్టింగ్ చూసి నేను ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం మర్చిపోయాను. నాకు కంట తడి పెట్టించాడు. మహేష్ యాక్టింగ్ కు సెట్స్ లోనే కన్నీరు పెట్టుకున్నాను. అంతగా పాత్రలో ఒదిగి పోయి నటించాడు. ‘మహర్షి’ చిత్రంలోని నటనకు గానూ మహేష్ బాబుకు అవార్డు రావడం ఖాయం” అంటూ జయసుధ చెప్పుకొచ్చారు.

ఇందులో అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. నిజానికి సాధారణ ప్రేక్షకులకైతే ఇందులో టెన్షన్ పడేంత విషయం లేదని అర్ధమవుతుంది. కానీ మహేష్ అభిమానులు టెన్షన్ వెనుక వేరే కారణం ఉంది. మహేష్ బాబు తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో కలిసి నటించింది జయసుధ. ఇందులో ‘బ్రహ్మోత్సవం’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా మహేష్ నటన గురించి అప్పుడు ఏమైతే కామెంట్లు చేసిందో.. ఇప్పుడు ‘మహర్షి’ చిత్రానికి కూడా అవే కామెంట్లు చేసింది. అదే స్క్రిప్ట్ మళ్ళీ చెప్పేసిందన్న మాట. ‘బ్రహ్మోత్సవం’ చిత్రం మహేష్ కెరీర్ పై చాలా ఎఫెక్ట్ పడింది. ఇప్పటికీ కోలుకోవడానికి ఇప్పండి పడుతూనే ఉన్నాడు. 2016 మే నెలలో విడుదలైన ఆ చిత్రంలో జయసుధ కీలక పాత్ర పోషించింది. ఇప్పడు ‘మహర్షి’ చిత్రంలో కూడా జయసుధ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం కూడా మే నెలలోనే విడుదలవుతుంది. ఈ రెండు చిత్రాలకి పీవీపీ నిర్మాత కాబట్టి.. ఇదో కామన్ పాయింట్. ఏకంగా ‘కంటతడి పెట్టించాడు.. అవార్డు కొట్టేస్తాడు’ అనే కామెంట్స్ చేసిన జయసుధ కి… ‘అప్పడు ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి కూడా ఇలానే చెప్పారు మేడమ్’ అంటూ కొందరు మహేష్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ ను టెన్షన్లో పెట్టేసింది ఈ సీనియర్ నటి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus