జీవా, కాజల్ కాంబినేషన్ సినిమా హక్కులు సొంతం చేసుకున్న “డి.వి.సినీ క్రియేషన్స్”

`రంగం` వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `కవలై వేండాం`. `యామిరుక్క బ‌య‌మేన్‌` ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తమిళం లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు హక్కులు కోసం చాలా మంది అతిరథులు పోటీ పడ్డప్పటికీ డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ ఫ్యాన్సీ ఆఫర్ తో హక్కులను దక్కించుకున్నాడు.ఈ సందర్భంగా డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ “రంగం చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోగా నటించిన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అలాగే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు చాలా బావుంది. మంచి స్పందన వచ్చింది. దాంతో తెలుగులో సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నాను. త్వరలోనే తెలుగు టైటిల్ ను అనౌన్స్ చేస్తాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళంలో అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. `రంగం` చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను కూడా త‌మిళంలో నిర్మిస్తుండ‌టం విశేషం“ అన్నారు.జీవా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus