మరోసారి చిరంజీవి పై జీవిత రాజశేఖర్ కామెంట్స్..!

  • October 9, 2019 / 07:15 PM IST

మెగాస్టార్ చిరంజీవి, అలాగే హీరో రాజశేఖర్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. అని అలాగే వారి కుటుంబాల మధ్య కూడా అదే తరహాలో గొడవలు ఉన్నాయని అందరూ అనుకుంటూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ దశలో చిరు అభిమానులు హైదరాబాద్ నడిరోడ్ల పై రాజశేఖర్ ను అవమానించారు కూడా…! అసలు చిరంజీవి, రాజశేఖర్ మధ్య గొడవలు ఉన్నాయా? అసలు వారి మధ్య రేలేషన్ ఎలా ఉంది. అనే విషయాల పై రాజశేఖర్ భార్య జీవిత తాజాగా స్పందించారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత మాట్లాడుతూ అసలు సంగతుల్ని చెప్పుకొచ్చింది.

జీవిత మాట్లాడుతూ… కొన్ని సందర్భాల్లో కొందరు నచ్చుతారు, మరికొన్ని సందర్భాల్లో కొందరు నచ్చరు. అలాగని వారితో శత్రుత్వం ఉన్నట్టు కాదు. చిరంజీవి వద్దకు వెళ్ళి ‘గరుడవేగ’ చిత్రాన్ని చూడాలని కోరతే… ‘మా హీరోను తిట్టిన రాజశేఖర్, ఇప్పుడు వెళ్ళి సినిమాను చూడడం ఏంటి’ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. సినిమా మరింత కలెక్షన్లు సాధించాలనే ఇలా చేశారని కూడా విమర్శించారు. అయితే, చిరంజీవి కుటుంబానికి మా కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన్ని చాలా ఫంక్షన్లలో కలుస్తాము, బాగా మాట్లాడుకుంటాము. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తరువాత ఆ స్థాయిని సంపాదించుకున్న ఏకైక హీరో చిరంజీవేనని, వెబ్ సైట్లలో రాసిన రాతలను ఎవరమూ పట్టించుకోలేదని చెప్పారు. ‘గరుడవేగ’ చిత్రాన్ని చూసి చిరంజీవి తన అభిప్రాయాన్ని చెప్పాలన్న ఉద్దేశంతోనే ఆయన్ను కలిశాము. అయితే ఆ విషయం పై అలాంటి వార్తలు రాసేయడం మమ్మల్ని బాద పెట్టాయి.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus