‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మాణంలో ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘జెర్సీ’. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ సంగీతమందించిన ఈ చిత్రం ఏప్రిల్ 19 న(నిన్న) విడుదలయ్యింది. మొదటి షో తోనే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ‘జెర్సీ’ చిత్రానికి 6.8 కోట్ల షేర్ వచ్చింది.
‘జెర్సీ’ మొదటి రోజు ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
వైజాగ్ – 0.54 కోట్లు
సీడెడ్ – 0.40 కోట్లు
కృష్ణా – 0.34 కోట్లు
వెస్ట్ – 0.30 కోట్లు
నెల్లూరు – 0.17 కోట్లు
————————————————
ఏపీ + తెలంగాణ – 4.45 కోట్లు
రెస్ట్ అఫ్
ఇండియా – 0.90 కోట్లు
ఓవర్సీస్ – 1.45 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ – 6.8 కోట్లు (షేర్)
————————————————–
‘జెర్సీ’ చిత్రానికి 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 26 కోట్లకు పైగా షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు 6.8 కోట్ల షేర్ వచ్చింది. నాని మార్కెట్ బట్టి చూసుకుంటే ‘జెర్సీ’ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడం పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే ‘జెర్సీ’ రిలీజ్ రోజునే లారెన్స్ ‘కాంచన3’ కూడా రిలీజయ్యింది. ఈ చిత్రానికి కూడా మంచి క్రేజ్ ఉండడంతో బి,సి సెంటర్స్ లో ‘జెర్సీ’ కలెక్షన్ల పై ఎఫెక్ట్ పడింది. లేకపోతే ‘జెర్సీ’ చిత్రానికి 9 కోట్ల వరకూ షేర్ వచ్చి ఉండేది అనడంలో సందేహం లేదు. అయితే ‘కాంచన 3’ కి డివైడ్ టాక్ రావడంతో ‘జెర్సీ’ బుకింగ్స్ మళ్ళీ ఊపందుకున్నాయి. అయితే వచ్చే వారంలో కూడా కొత్త సినిమాలేమీ రిలీజ్ లేకపోవడం ‘జెర్సీ’ చిత్రానికి కలిసొచ్చే అవకాశం ఉంది. మరి ఈ అవకాశాన్ని ‘జెర్సీ’ ఎంతవరకూ ఉపయోగించుకుంటుందో… చూడాలి.