‘జెర్సీ’ డైరెక్టర్ కు క్రేజీ ఆఫర్లు ?

గత వారం విడుదలైన నాని ‘జెర్సీ’ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి స్టార్ హీరోల దగ్గర్నుండీ, స్టార్ దర్శకులు సైతం ప్రశంసల వర్షం గురిపిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన విధానం ఈ చిత్రానికి ఒక హైలెట్ అయితే అర్జున్ పాత్రలో నాని నటించిన తీరు మరో హైలెట్. ఏదేమైనా సినిమా మేజర్ క్రెడిట్ మాత్రం దర్శకుడికే ఇవ్వాలి.. తను రాసుకున్న కథని చాలా సున్నితంగా తెరకెక్కించాడు గౌతమ్. తన టాలెంట్ చూసి దిల్ రాజు,రాజమౌళి వంటి సక్సెస్ ఫుల్ సెలెబ్రిటీలే ఫిదా అయిపోయారంటే.. గౌతమ్ కెపాసిటీ ఏంటనేది అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుర్ర డైరెక్టర్ ను వెతుక్కుంటూ నిర్మాతలు వస్తున్నారట.

అయితే గౌతమ్ మాత్రం తన నెక్స్ట్ సినిమాను మాత్రం ఓ పెద్ద హీరోలతో చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళని లైన్లో పెట్టే పనిలోనే ఇప్పుడు గౌతమ్ బిజీగా ఉన్నాడట. ఈ క్రమంలో ఎన్టీఆర్ ను కలిసి ఓ కథ చెప్పాడట. ఈ కథ నచ్చడంతో .. పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసి కలవమని ఎన్టీఆర్ చెప్పడంతో.. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నాడట గౌతమ్. తరువాత చరణ్, విజయ్ దేవరకొండ లను కూడా లైన్లో పెట్టేద్దామనే ఆలోచనలో ఉన్నాడట. ఇక చరణ్ ను కలుసుకోవడానికి నిర్మాత ఎన్వీ ప్రసాద్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఇది వర్కౌట్ అయితే ఈ ప్రాజెక్ట్ ను ఎన్వీ ప్రసాదే నిర్మించే అవకాశం ఉందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus