Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్ కి జెస్సీ వార్నింగ్ ఇచ్చి ఎందుకు వెళ్లాడు..?

బిగ్ బాస్ హౌస్ లో జెస్సీ జెర్నీ ముగిసింది. భావోద్వేగంతో కూడిన జెర్నీని స్టేజ్ పైన చూసిన తర్వాత జెస్సీ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. నామినేషన్స్ లో లేకపోయినా కూడా జెస్సీ గేమ్ నుంచీ అవుట్ అవ్వడం అనేది బిగ్ బాస్ లవర్స్ ని సైతం కలచివేసింది. అయితే, జెస్సీ హౌస్ మేట్స్ ని పలకరిస్తూ వారికి బై చెప్తూ ఫోన్ కాల్ లో సజెషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ జెస్సీ సన్నీతో మాట్లాడుతూ.. జాగ్రత్తగా గేమ్ ఆడమని, టెంపర్ లూజ్ అవ్వకు అని, ఒక్కడిగానే గేమ్ ఆడు.., గ్రూప్స్ తో ఆడితే గెలవలేం అన్నట్లుగా చెప్పాడు.

అంతేకాదు, అలా ఆడితేనే హీరో అవుతావ్, లేదా కమెడియన్ గానే మిగిలిపోతావ్ అన్నాడు. ఆతర్వాత మానస్ తో కూాడ ఇలాగే చెప్పాడు. నువ్వు సైలెంట్ కిల్లర్ అని, రవికి బాబులాంటి వాడివి అని, అంత బ్రైయిన్ ఉంచుకుని గేమ్ ఆడలేకపోతున్నావ్ అని అన్నాడు. అలాగే, కాజల్ తో నీ గేమ్ ఏమైంది..? ఎందుకు వేరేవాళ్లని ఎక్కువగా నమ్ముతున్నావ్ ? అంటూ నిలదీశాడు. నీకు ఫ్రెండ్స్ వాల్యూ ఇవ్వడం లేదని, నిన్ను యూజ్ చేస్కుంటున్నారు చూస్కో అంటూ హితవు పలికాడు.

అనీమాస్టర్ తో మాట్లాడుతూ., మీ గేమ్ చాలా బాగుందని చెప్పాడు. అలాగే ప్రియాంకకి త్యాగాలు ఆపేశేయ్, నీకోసం గేమ్ ఆడమని చెప్పాడు. నువ్వు బయట ఎంతోమందికి ఇన్సిపిరేషన్ గా ఉండాలి కానీ, నీ గేమ్ చూసి అబ్బా.. ఇలా ఆడకూడదు అనేలా ఉండద్దని చెప్పాడు. శ్రీరామ్ చంద్రని టాప్ 5లో ఉంటావని చెప్పిన జెస్సీ, రవితో ఫోన్ లో మాట్లాడుతూ నీ గేమ్ చాలా బాగుందని, ఫైనల్స్ లో కలుద్దామని హింట్ ఇచ్చాడు. ఇక తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సిరితో షణ్ముక్ తో మాట్లాడుతూ భావోద్వేగానికి గురి అయ్యాడు జెస్సీ. హౌస్ లో లాస్ట్ డేస్ నీతో ఉండలేకపోయాను అంటూ బాధపడ్డాడు. అంతేకాదు, షణ్ముక్ తో ఎప్పటికీ నేను నీ సీక్రెట్ ఫ్రెండ్ నే అంటూ చెప్పాడు.

షణ్ముక్ మాట్లాడుతూ.. నువ్వు ఇంకొకరికి లైఫ్ ఇచ్చి వెళ్తున్నావ్ చూడు.. అదిరా నువ్వు అంటూ మాట్లాడాడు. ఇక్కడే జెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిరి, ష‌ణ్ముఖ్, శ్రీరామ్‌, ర‌విలు టాప్ 5లో ఉంటారని గెస్ చేసి చెప్పాడు. అంతేకాదు, మిగతా హౌస్ మేట్స్ కి చురకలు అంటించాడు. వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు. గ్రూప్స్ గా గేమ్ ఆడకండి. ఇండివెడ్యువల్ గా ఆడండి అప్పుడు సత్తా తెలుస్తుందన్నట్లుగా చెప్పాడు జెస్సీ. ఇప్పుడు జెస్సీ అన్నమాటలు ఖచ్చితంగా హౌస్ మేట్స్ ఆలోచిస్తారు. అంతేకాదు, రవి నేను నీకు అడ్డు వచ్చే వాళ్లకి ఖచ్చితంగా తెలిసేలా చెప్పాను అంటూ మాట్లాడాడు. దీన్ని బట్టీ చూస్తే జెస్సీ వెళ్తూ వెళ్తూ హౌస్ మేట్స్ బుర్రలో తన ఆలోచనలని ఎక్కించి వెళ్లాడనే తెలుస్తోంది. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus