ప్రతి మహిళా చూడదగ్గ చిత్రం ఝాన్సీ, ఆగష్టు 17 విడుదల అవుతుంది – కోనేరు కల్పనా

తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరు తో ఈ నెల ఆగష్టు 17 న విడుదల కు సిద్ధం గా ఉంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ లంచాలతో ప్రపంచవ్యాప్తంగా అధిక థియేటర్ లో ఆగష్టు 17 న విడుదల అవుతుంది.

ఈ సందర్భం గా నిర్మాతలలో ఒకరైన కోనేరు కల్పనా గారు మాట్లాడుతూ “జ్యోతిక గారు అంటే నాకు చాల ఇష్టం. వారి నటన మహా అద్భుతం. వారు ఈ సినిమా లో పోలీస్ ఆఫీసర్ గా తన విశ్వరూపం ని చూపించారు. సినిమా చుసిన వెంటనే మన తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి అని యస్వంత్ మూవీస్ బ్యానర్ తో కలిసి మేము ఈ సినిమా ని ఈ నెల ఆగష్టు 17 న విడుదల చేస్తున్నాము. డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అధిక థియేటర్ లో విడుదల చేస్తున్నాము.

ఈ సినిమా ప్రతి మహిళా చూడదగ్గ చిత్రం. ఆడవాళ్లపై జరుగుతున్నా హత్యాచారాలు వాటిని ఎలా ఎదురుకోవాలో ఈ సినిమా లో చాల బాగా చూపించారు. దర్శకుడు బాల గారికి మన తెలుగు లో కూడా మంచి పేరు ఉంది. వారు దర్శకత్వం వహించిన శేషు, శివ పుత్రుడు, వాడు వీడు ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసారు. ఝాన్సీ సినిమా కూడా అంతటి విజయం సాధిస్తుంది అని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus