Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • కృష్ణ బురుగుల (Hero)
  • NA (Heroine)
  • రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా తదితరులు (Cast)
  • హరీష్ రెడ్డి ఉప్పుల (Director)
  • కృష్ణ ఓడపల్లి (Producer)
  • కమ్రాన్ (Music)
  • ఈశ్వరాదిత్య (Cinematography)
  • చాణక్య రెడ్డి (Editor)
  • Release Date : నవంబర్ 14, 2025
  • మౌంట్ పెరూ పిక్చర్స్ (Banner)

తెలుగులో బడ్డీ కామెడీ జోనర్ లో సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. వచ్చినా సరిగా వర్కవుట్ అవ్వవు. ప్రెజెంట్ జనరేషన్ లో అనుదీప్, తరుణ్ భాస్కర్ లు మాత్రమే ఆ జోనర్ లో హిట్లు కొట్టారు. అదే జోనర్ లో హరీష్ రెడ్డి ఉప్పుల తెరకెక్కించిన చిత్రం “జిగ్రీస్”. ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగా ప్రమోట్ చేయడంతో జనాలకి తెలిసింది. మరి సినిమా ఎలా ఉంది? నవ్వించిందా? అనేది చూద్దాం..!!

Jigris Movie Review

కథ: ఓ నలుగురు స్నేహితులు (కృష్ణ బూరుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా)లు ఒక ఎమోషనల్ మూమెంట్ లో గోవా వెళ్దాం అని ఫిక్స్ అయ్యి.. ఓ హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్ తో తమ దగ్గర ఉన్న పర్సులు, డబ్బులు, ఫోన్లు అన్నీ పడేసి పాత మారుతి 800 కారులో గోవా బయలుదేరతారు.

చేతిలో డబ్బులు లేకుండా ఈ నలుగురు గోవా ఎలా వెళ్లారు? ఈ క్రమంలో వాళ్లకి ఎదురైన సమస్యలు ఏమిటి? వాటిని వాళ్లు ఎలా పరిష్కరించుకున్నారు? ఈ ప్రయాణంలో వాళ్లు నేర్చుకున్న జీవితపాఠం ఏమిటి? అనేది “జిగ్రీస్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: కృష్ణ బురుగుల క్యారెక్టర్ లో ఒక వైబ్ ఉంది. చాలామంది రిలేట్ అవుతాం. మనం అలాగే ఉండేవాళ్ళం కదా లేకపోతే మన ఫ్రెండ్ అలా ఉండేవాడు కదా అని కచ్చితంగా అనుకుంటాం. కామెడీ చాలా నేచురల్ గా వర్కవుట్ అయ్యింది ఈ పాత్ర ద్వారా.

రామ్ నితిన్ గెడ్డం విషయంలో కంటిన్యూటీ మిస్ అయినప్పటికీ.. నటుడిగా మాత్రం మంచి నటనతో అలరించాడు. ఈ సినిమాని ప్రమోట్ చేయకుండా తప్పు చేశాడు అనిపించింది. సాధారణంగా ఏదైనా బ్యాడ్ ప్రాజెక్ట్ అయితే నటీనటులు ప్రమోషన్స్ నుండి తప్పుకోవడం చూస్తూ వచ్చాం కానీ.. రామ్ నితిన్ కి ప్లస్ అయ్యే ఈ ప్రాజెక్ట్ ను అతడు వదిలేయడం అనేది గమనార్హం.

మణి వక్కా మంచి ఎమోషనల్ రోల్ లో అలరించాడు. ధీరజ్ ఆత్రేయ అమాయకత్వం మంచి హాస్యాన్ని పండించింది.

సాంకేతికవర్గం పనితీరు: కమ్రాన్ మ్యూజిక్ సినిమాకి మంచి పాజిటివిటీ తీసుకొచ్చింది. పాటలు, బీజియం కథను ముందుకు నడపడానికి హెల్ప్ అయ్యాయి. చాలా సింపుల్ గా వినిపించినప్పటికీ.. ఎక్కడా థియేటరికల్ ఎక్స్ పీరియన్స్ ను పాడుచేయలేదు.

ఈశ్వరాదిత్య సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. రెగ్యులర్ ఫ్రేమ్స్ ను దాదాపుగా ఎవాయిడ్ చేశాడు. ముఖ్యంగా డ్రోన్ షాట్స్ మంచి కిక్ ఇచ్చాయి.

దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల సింగిల్ పాయింట్ కథను.. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో చెప్పాలనుకున్న విధానం బాగుంది. కొంతమేరకు వర్కవుట్ అయ్యింది కూడా. అయితే.. సెకండాఫ్ లో వచ్చే లారీ & ఆటో కామెడీ సీన్స్ కేవలం రన్ టైమ్ పెంచడానికి తప్ప కథకి ఏమాత్రం ఉపయోగపడలేదు. అలాగే.. బరాత్ కామెడీ కూడా ఎక్కువగా సాగదీశాడు. ఇలాంటి తప్పుల్ని కాస్త ఎడిట్ చేస్తే.. ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లో రెండు గంటలపాటు హ్యాపీగా సినిమా చూడొచ్చు. అలాగే.. ఎమోషనల్ పాయింట్ ను కూడా మరీ డ్రమటిక్ గా కాకుండా సింపుల్ గా చెప్పిన విధానం బాగుంది. ఫ్రెండ్ షిప్, సిల్లీ ఐడియాస్, సెన్స్ లెస్ ఆటిట్యూడ్ లను కలగలిపిన విధానం ప్రశంసనీయం. ఓవరాల్ గా.. దర్శకుడిగా హరీష్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పొచ్చు.

విశ్లేషణ: ఎక్కువగా ఆలోచించకుండా.. హ్యాపీగా ఫ్రెండ్స్ తో కలిసి థియేటర్లో చూస్తూ టైమ్ పాస్ చేసే సినిమాలు ఈమధ్య తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా “ఈ నగరానికి ఏమైంది?” అనంతరం తెలుగులో సరైన బడ్డీ కామెడీ సినిమా రాలేదు. “జిగ్రీస్” ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ.. మంచి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. పైన పేర్కొన్న లారీ & ఆటో సీన్ ను ఎడిట్ చేసి, మిగతా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్ గా మార్చి.. ప్రాపర్ గా ప్రమోట్ చేస్తే హిట్ అయ్యే లక్షణాలు ఉన్న సినిమా ఇది. మీ ఫ్రెండ్స్ తో అయితే హ్యాపీగా చూసేయొచ్చు.

ఫోకస్ పాయింట్: టైంపాస్ బడ్డీ కామెడీ ఫిలిం!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus