ప్రభాస్ కి విసుగొచ్చింది.. ఫ్యాన్స్ కు భాదొస్తుంది..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘బాహుబలి’ చిత్రం తర్వాత ఈ పేరు డబుల్, ట్రిపుల్ అయ్యింది. ఈ చిత్రం చూసిన తరువాత ఇండియా వైడ్ ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ప్రభాస్ గ్లామర్ తో పాటూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునేది… యాక్షన్ సీన్లలో తను ఇచ్చే ఎక్స్ ప్రెషన్సే అనడంలో సందేహమే లేదు. ప్రభాస్ లాంటి హీరోతో ఓ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అంటే అందులో యాక్షన్ ఎలిమెంట్స్ పెట్టి మరింత ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుంటాడు. అయితే ‘జిల్’ డైరెక్టర్ రాధాకృష్ణ కు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వట్లేదట ప్రభాస్.

అసలు విషయానికొస్తే.. ‘బాహుబలి’ – ‘సాహో’ వంటి చిత్రాలు చేసి ప్రభాస్ కు యాక్షన్ అంటే విసుగొచ్చేసినట్టుంది. అందుకే తన తరువాతి సినిమాలో యాక్షన్ డోస్ తగ్గించి పూర్తిగా లవ్ అండ్ ఎమోషన్ డ్రామా నేపథ్యంలో చేయాలనీ ఫిక్సయిపోయినట్టున్నాడు. ఇందులో భాగంగా రాధాకృష్ణ తో చేయబోయే లవ్ స్టోరీలో రెండు భారీ యాక్షన్ సీన్స్ ను ప్రభాస్ తీయించేశాడని తెలుస్తుంది. ఎప్పటినుండో ప్రభాస్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకొని పక్కాగా ప్లాన్ చేసుకున్న ఈ దర్శకుడికి అవసరం లేని చోట సెట్స్ వేసి భారీ యాక్షన్ సీన్లు వద్దు… సింపుల్ ఫైట్స్ తో లాగించేయమని ప్రభాస్ కోరాడట. ఇప్పుడు ఆ డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి యాక్షన్ హీరోతో సినిమా చేస్తున్నందుకు సంతోషపడాలో.. లేక అసలు యాక్షన్ లేకుండా సినిమా చేస్తున్నందుకు భాదపడాలో తెలియని అయోమయంలో ఆ డైరెక్టర్ ఉన్నాడట. ఇదిలా ఉంటే… ఈ వార్త బయటకొచ్చినప్పటి నుండీ ప్రభాస్ అభిమానులు కొంచెం నిరాశకు గురయ్యారట. ‘అసలే 1940 లవ్ స్టోరీ అంటున్నారు.. అందులోనూ అసలు ఫైట్లు లేకపోతే ఎలా’ అని సోషల్ మీడియాలో కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus