జగన్ నమ్ముకున్నందుకు జోగినాయుడుకి పదవి.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్ సర్కార్ గత ఎన్నికలలో భాగంగా తన పార్టీ కోసం కృషి చేసిన వారికి పెద్ద ఎత్తున పదవులు కట్టబెడుతోంది ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి అలీ పోసాని మంగ్లీ వంటి వారికి కీలక పదవులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఎన్నికలలో భాగంగా పార్టీ ప్రచార కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ విజయానికి తన వంతు కృషి చేశారు కమెడియన్ జోగి నాయుడు.

ఇలా కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన ఈయన వైసీపీ పార్టీకి తన మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే వైసిపి ప్రభుత్వం జోగినాయుడిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయంపై సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ స్పందించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ జగన్ గారిని నమ్ముకున్నందుకు జోగినాయుడికి పదవి వచ్చింది… ఆల్ ది బెస్ట్ తమ్ముడు అంటూ ట్వీట్ చేశారు.ఇలా బండ్ల గణేష్ ఇలాంటి ట్వీట్ చేయడంతో జనసేన నాయకులు బండ్ల గణేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

బండ్ల గణేష్ చేసినటువంటి ఈట్వీట్ గురించి పలువురు జనసేన నాయకులు స్పందిస్తూ త్రివిక్రమ్ నిన్ను ఎందుకు దూరం పెట్టారో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ కొందరు కామెంట్లు చేయగా ఇలా రంగులు మార్చే ఊసరవెల్లిని దూరంగా పెట్టడమే మంచిది అన్న అంటూ పవన్ కళ్యాణ్ కు సూచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ కారణంగా జనసేన నాయకుల ట్రోలింగ్ కి గురవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus