Jr NTR: తాత ఇచ్చిన మూడు అక్షరాలు, పోలికలు చాలు.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నారు. తారక్ నటిస్తున్న సినిమాలు బిజినెస్ పరంగా అదరగొడుతున్నాయి. నందమూరి హీరోలలో టాప్ హీరోగా నిలుస్తూ అభిమానులను తన సినిమాలతో తారక్ మెప్పిస్తున్నారు. డబుల్ హ్యాట్రిక్ సాధించిన తారక్ భవిష్యత్తు సినిమాలతో కూడా ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఒకసారి తాత సీనియర్ ఎన్టీఆర్ గారు అమ్మగారిని నన్ను రమ్మన్నారని

ఆ సమయంలో తాతయ్య అమ్మతో ఇంతకాలం దూరంగా ఉన్నామని నీ కొడుకు నా అంతటి వాడిగా తీర్చిదిద్దడంలో నీ వంతు బాధ్యత నువ్వు నిర్వర్తించు నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తానని అన్నారని చెపుకొచ్చారు. తాతయ్య ఈ విషయాలు చెప్పిన కొంతకాలం తర్వాత చనిపోయారని ఆ సమయంలో తాతయ్యపై కోపం వచ్చిందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. అనాథగా మమ్మల్ని వదిలేసి తాతయ్య వెళ్లిపోయాడని అనిపించిందని తారక్ పేర్కొన్నారు.

ఆ తర్వాత తాతయ్య ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఇచ్చాడని పోలికలు ఇచ్చాడని అనిపించిందని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. తాతయ్య ఆశీర్వాదంతో ఆయన వంతు బాధ్యత ఆయన నిర్వర్తించాడని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. మా అమ్మ బాధ్యత అమ్మ నిర్వర్తించిందని నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానని తారక్ పేర్కొన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్ కూడా త్వరలో మొదలు కానుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తుండటం గమనార్హం. తారక్ సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా అదరగొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో మూవీకి సంబంధించి కూడా అనధికారికంగా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus