Music Shop Murthy Review in Telugu: మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 14, 2024 / 04:21 PM IST

Cast & Crew

  • అజయ్ ఘోష్ (Hero)
  • చాందినీ చౌదరి (Heroine)
  • ఆమని, భానుచందర్, దయానంద్ రెడ్డి,అమిత్ శర్మ తదితరులు (Cast)
  • శివ పాలడుగు (Director)
  • హర్ష గారపాటి & రంగారావు గారపాటి (Producer)
  • పవన్ (Music)
  • శ్రీనివాస్ బెజుగం (Cinematography)

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ట్రైలర్.. సినిమా పై ఆసక్తిని రేకెత్తించింది. మరి ట్రైలర్.. మాదిరి సినిమా ఉందో లేదో తెలుసుకుందాం రండి :

కథ : మూర్తి (అజయ్ ఘోష్) 53 ఏళ్ళ వయసు మీదపడిన వ్యక్తి. 30 ఏళ్లుగా వినుకొండలో ఓ మ్యూజిక్ షాప్ నడుపుతూ.. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని నడుపుతూ ఉంటాడు. అతనికి భార్య.. ఇద్దరు కూతుర్లు ఉంటారు. మూర్తి భార్య జయకి(ఆమని) అతను మ్యూజిక్ షాప్ నడపడం ఇష్టం ఉండదు. ‘దాని పై రాబడి ఉండటం లేదని.. దాని బదులు ఓ సెల్ ఫోన్ షాప్ పెట్టుకుని సంపాదించమని’ అతన్ని నసపెడుతూ ఉంటుంది. కానీ మూర్తికి మ్యూజిక్ తప్ప ఇంకేమీ రాదు. అయితే అతని పెద్ద కూతురు ఫీజ్ కోసం ఓ రోజు ఓ బర్త్ డే పార్టీలో మ్యూజిక్ ప్లే చేయడానికి ఒప్పుకుంటాడు. అతను బాగా మ్యూజిక్ ప్లే చేయడంతో ప్రేక్షకులు అతన్ని మెచ్చుకోవడం మాత్రమే కాకుండా ..

అతనికి డీజే వాయించడం నేర్చుకోమని.. ‘మీకు మంచి సంపాదన ఉంటుందని’ సలహా ఇస్తారు. ఇదిలా ఉంటే.. మరోపక్క అంజనాకి(చాందినీ చౌదరి) కూడా మ్యూజిక్ అంటే ఇష్టం. ఆమె కూడా డీజే అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అతని తండ్రికి(భానుచందర్) అది ఎంత మాత్రం నచ్చదు. ఓ రోజు ఆమె డీజే కన్సోల్ ను (డీజే ప్లే చేసే మిషన్) నేలకేసి కొడతాడు. అది పాడవ్వడంతో ఆమె మ్యూజిక్ షాప్ మూర్తి వద్దకి రిపేర్ చేయించుకునేందుకు వెళ్తుంది. ఇక అది రిపేర్ చేస్తే.. ‘డబ్బులకి బదులు ఫ్రీగా డీజే నేర్పించమని’ మూర్తి ఆమెను కోరతాడు.

అందుకు జయ కూడా ఓకే చెప్పి.. మూర్తికి డీజే వాయించడంలో శిక్షణ ఇస్తుంది. అలా వీరి మధ్య స్నేహం కూడా ఏర్పడుతుంది. ఈ క్రమంలో వీరి బంధాన్ని ఊర్లో వాళ్ళు, కుటుంబ సభ్యులు తప్పుగా అర్ధం చేసుకుంటారు. అంతేకాదు కుటుంబ సభ్యులైతే డీజేని వదిలేయాలని వార్నింగ్ ఇస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు తమ కెరీర్ కోసం ఏం చేశారు.? ఫైనల్ గా సక్సెస్ అయ్యారా లేక కుటుంబ సభ్యుల కోసం కాంప్రమైజ్ అయిపోయి వారి చెప్పింది చేశారా? ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే ‘మ్యూజిక్ షాప్’ మూర్తి చూడాల్సిందే.

నటీనటుల పనితీరు : అజయ్ ఘోష్ విలన్ పాత్రలతో కెరీర్ ను ప్రారంభించాడు. ఈ మధ్య కామెడీ విలన్ గా మారి పెద్ద సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఒక్క విషయం.. అజయ్ ఘోష్ నటనకి యూత్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అది ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాకి అజయ్ ఘోష్ ను తప్ప వేరే నటుడిని ఊహించుకోలేం. అంత బాగా నటించాడు. అతని డైలాగ్ డెలివరీ కూడా చాలా క్లుప్తంగా ఉంది. ఎమోషనల్ సీన్స్ లో అయితే కంటతడి పెట్టించేశాడు. అలా అతను ఫుల్ మర్క్స్ కొట్టేశాడు అని చెప్పాలి.

అతని తర్వాత చాందినీ చౌదరి మెయిన్ రోల్. ఆమె కూడా బాగా నటించింది. భానుచందర్ వంటి సీనియర్ నటుడితో పోటీపడి మరీ నటించింది. కానీ ఈమె కంటే కూడా సీనియర్ నటి ఆమని ఇంకా బాగా పెర్ఫార్మ్ చేసింది అని చెప్పాలి. ఆమనికి కూడా చాలా రోజుల తర్వాత మంచి పాత్ర లభించింది. ఆ అవకాశాన్ని ఆమె సద్వినియోగపరుచుకుంది. దయానంద్ రెడ్డి కూడా బాగా నటించాడు. అమిత్ శర్మ కూడా..! కాకపోతే అమిత్ శర్మ పాత్రకు సరైన ఎండింగ్ ఇవ్వలేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది.

సాంకేతిక నిపుణుల పనితీరు : ‘టాలెంట్ కి ఏజ్ తో పనిలేదు’ అనే లైన్ తో దర్శకుడు శివ పాలడుగు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇదొక ఫీల్ గుడ్ సినిమా అంటే సరిపోదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి అలాగే యూత్ కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఇందులో చాలా సన్నివేశాలు.. థియేటర్ నుండి బయటకి వచ్చాక కూడా ప్రేక్షకుల్ని వెంటాడతాయి. క్లైమాక్స్ లో వచ్చే ఇంటర్వ్యూ సీన్ కి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నా ఆశ్చర్యపడనవసరం లేదు.

డైరెక్షన్ కి కూడా మంచి మార్కులే పడతాయి. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా బాగున్నాయి. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు ఉన్నాయి. లోటు పాట్లు అంటూ ఏమీ ఉండవు. రన్ టైం కూడా 2 గంటల 7 నిమిషాలే కావడం ఇంకో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.

విశ్లేషణ : ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా ఆకట్టుకునే ఎలిమెంట్స్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ లో ఉన్నాయి. ఈ వీకెండ్ కి మిస్ కాకుండా చూడాల్సిన సినిమా.

రేటింగ్ : 3/5

ఫోకస్ పాయింట్ : ఫ్యామిలీస్ తో పాటు యూత్ కూడా తప్పకుండా చూడాల్సిన సినిమా

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus