Jr NTR, Kalyan Ram: కళ్యాణ్ రామ్ అన్న లేకపోతే ‘బింబిసార’ లేదు : ఎన్టీఆర్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘బింబిసార’. ఆగష్టు 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్లోని శిల్ప కళా వేదికలో ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కళ్యాణ్ రామ్ కు ‘బింబిసార’ యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “సరిగ్గా రెండున్నర సంవత్సరాల క్రితం కళ్యాణ్ అన్న ఫోన్ చేసి ‘నాన్న మంచి కథ విన్నాను బాగుంది..’ అని చాలా ఎక్సయిట్మెంట్ తో చెప్పాడు.

అప్పుడు నేను కూడా ఆ కథ విన్నాను. అంతకు ముందు ఏ సినిమాకి పనిచేయకుండానే ,ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండానే ఎంతో కసితో దర్శకుడు వశిష్ఠ్ ఈ కథ చెప్పాడు. నాకు చాలా భయం వేసింది. ఇంత వెయిట్ ఉన్న కథని ఇతను ఎలా హ్యాండిల్ చేస్తాడో అని. కానీ నాకు ఎంత కసితో అయితే చెప్పాడో అంతే కసితో ఈ చిత్రాన్ని తెరపై మలిచాడు.అది అంత ఈజీ టాస్క్ కాదు. కథనం నాకు తెలుసు. ఇంత తెలిసిన నేనే ఎంతో ఎగ్జైట్మెంట్‌కు గురయ్యాను.

ప్రేక్షక దేవుళ్లు ఈ సినిమా చూసి అంతే ఎక్సయిట్మెంట్ కు గురువతారు అనిపిస్తుంది. మీ అందరికంటే నేను అదృష్టవంతుడిని, ఎందుకంటే మీకంటే ముందే నేను ఈ సినిమాని చూశాను. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది. కళ్యాణ్ రామ్ అన్న ఈ చిత్రం కోసం బ్లడ్ పెట్టి పనిచేశాడు. కళ్యాణ్ రామ్ అన్న కాకుండా అయితే ‘బింబిసార’ లేదు. కళ్యాణ్ రామ్ అన్న కెరీర్ ‘బింబిసార’ కి ముందు ‘బింబిసార’ తర్వాత అని చెప్పాలి” అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus