NTR, Balakrishna: తారక్ ఆ కథకు ఓకే చెబుతారా?

  • August 12, 2021 / 09:34 PM IST

సినిమా రంగంలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథకు మరో హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సాధారణంగా జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే బాలయ్య రిజెక్ట్ చేసిన కథ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వినబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రాఖీ సినిమా అబవ్ యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా ఉంటుంది.

రాఖీ తర్వాత ఎన్టీఆర్ కృష్ణవంశీ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. మరోవైపు కృష్ణవంశీ కొన్నేళ్ల క్రితం రైతు అనే స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుని బాలయ్యకు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల కథ నచ్చినా బాలయ్య ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కృష్ణవంశీ రైతు కథను ఎన్టీఆర్ కు చెప్పి ఒప్పించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కృష్ణవంశీ తారక్ మధ్య మంచి అనుబంధం ఉండటంతో

కథ నచ్చితే ఎన్టీఆర్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తారక్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఓకే చెప్పినా ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉంది. తారక్ తరువాత సినిమాలకు దర్శకత్వం వహించే డైరెక్టర్ల జాబితాలో పలువురు స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ సినిమాతో బిజీగా ఉండగా ఈ ఏడాది చివరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus