Jr NTR, Ram Charan: జపాన్ లో ఎన్టీఆర్, రాంచరణ్ లను చుట్టుముట్టిన అభిమానులు.. వైరల్ అవుతున్న వీడియో..!

‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం రణం రుధిరం’ చిత్రం అక్టోబర్ 21న జపాన్ దేశంలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం మూవీ టీం జపాన్ వెళ్ళింది. రాజమౌళి, ఎన్టీఆర్ మరియు అతని భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్.. మరో హీరో రామ్ చరణ్ మరియు అతని సతీమణి ఉపాసన కూడా జపాన్ వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో వీరి సందడి చేసి నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.అటు తర్వాత తారక్ స్టే చేసిన హోటల్లో కొంతమంది వచ్చి అతనికి వెల్కమ్ గ్రీటింగ్స్ ఇచ్చిన వీడియో కూడా వైరల్ అయ్యింది.

ఇక ఈరోజు జపాన్ కు చెందిన మీడియాతో చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ముచ్చటించారు. అనంతరం అక్కడి మీడియా సభ్యులు అలాగే అభిమానులు వీరిని ఆటోగ్రాఫ్ లు అడిగి తీసుకోవడం కూడా జరిగింది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన చరణ్, ఎన్టీఆర్ ల అభిమానులు విదేశాల్లో తమ హీరోల ఫాలోయింగ్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ఏడాది మార్చి 25న విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఏకంగా రూ.1200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక జపాన్ లో రాజమౌళి సినిమాలకు మంచి డిమాండ్ ఉండగా…. ఎన్టీఆర్ కు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి జపాన్ బాక్సాఫీస్ ను కూడా ‘ఆర్.ఆర్. ఆర్’ షేక్ చేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus