Jr NTR, Ram Charan: ఇలా అయితే స్టార్‌ మల్టీస్టారర్‌లు కష్టం బ్రదరూ!

ఫ్యాన్‌ వార్‌… టాలీవుడ్‌లో ఈ మాట చాలా రోజుల నుండి వింటూనే ఉన్నాం. ఆ మధ్య కాస్త తగ్గినట్లు కనిపించినా, సోషల్‌ మీడియా ముఖ్యంగా ట్విటర్‌లో ఈ వార్ ఎక్కువైపోయింది. సినిమా లుక్‌ నుండి సినిమా వరకు ఇలా ఏది వచ్చినా ఫ్యాన్స్‌ పేరుతో నోరేసుకొని పడిపోతున్నారు. ‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి మరీ తీసికట్టుగా మారిపోయింది అంటున్నారు. రామ్‌చరణ్‌, తారక్‌ ఫ్యాన్స్ మాటా మాటా అనుకుంటున్నారు. మార్ఫింగ్‌ ఫొటోలతో పరువు తీసుకుంటున్నారు, తీస్తున్నారు.

Click Here To Watch NOW

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చిన కొత్తల్లో తారక్ ఫ్యాన్స్‌, చరణ్‌ ఫ్యాన్స్‌ అంతా బాగుంది అనే కాన్సెప్ట్‌లో ఉన్నారు. చూడటానికి చాలా బాగుండటంతో ఈ సినిమాకు ఫ్యాన్‌ వార్‌ ఉండదు అని అందరూ అనుకున్నారు. రాను రాను చూస్తే పరిస్థితి మారిపోయింది. ఒక హీరో గురించి ఇంకో హీరో ఫ్యాన్స్‌ తిట్టుకోవడం మొదలుపెట్టారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ థియేట‌ర్లు తిరునాళ్ల‌లా మారిపోయాయి. ఈ క్రమంలో అభిమానం కూడా.. గేట్లు దాటేసింది. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ అభిమానులు పై చేయి కోసం ఆరాట‌ప‌డ్డారు.

హైద‌రాబాద్‌లో ఉద‌యం మూడున్న‌ర‌కు ప్రీమియ‌ర్ షో జ‌రిగింది. ధియేట‌ర్‌లో చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ అభిమానులు రెండుగా విడిపోయారు. ‘జై ఎన్టీఆర్‌’ అని ఓ వ‌ర్గం, ‘జై చ‌ర‌ణ్‌’ అంటూ మరో వ‌ర్గం నినాదాల‌తో హోరెత్తించారు. కూక‌ట్‌ప‌ల్లి భ్రమ‌రాంబ‌, మ‌ల్లిఖార్జున ధియేట‌ర్ల ద‌గ్గ‌రైతే చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా నువ్వా నేనా అన్న‌ట్టు సాగిందంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని ధియేట‌ర్లలో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ మ‌ధ్య ఘర్ష‌ణ వాతావరణం కూడా చోటు చేసుకుంద‌ని స‌మాచారం.

మా వాడు ఎక్కువ అంటే, కాదు కాదు మా వాడే ఎక్కువ‌ అంటూ నోళ్లు లేచాయి. ఇలా ఎవ‌రికి తోచిన దారిలో వాళ్లు త‌మ ఆధిప‌త్య ప్ర‌ద‌ర్శ‌న చేశారు. దీనికి ట్విటర్‌లో వార్‌ ఆజ్యం పోసింది అని చెప్పొచ్చు. పోస్టర్లు, మీమ్‌లు… ఇలా రకరకాలుగా గోల గోల చేశారు. మా హీరో ఫలానా సీన్‌లో అదరగొట్టాడు, మీవాడు తేలిపోయాడు అంటూ వీడియోలు షేర్‌ చేస్తూ మరీ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ప్రతి సినిమా విడుదలప్పుడు ఇలాంటి కామెంట్లు వినిపిస్తాయి. మల్టీస్టారర్‌ సమయంలో ఇలాంటి రావడం కాస్త ఎక్కువ తలనొప్పి తెప్పిస్తోంది.

ఇలాంటి పోలికలు, అలకలు, గొడవలు కొనసాగితే… భవిష్యత్తులో ఇలాంటి పెద్ద పెద్ద మల్టీస్టారర్‌లు రావడం కష్టమవుతుంది. హీరోలను సంతృప్తి పరిచే కథ దొరకడం కష్టం. అలాంటిది ఫ్యాన్‌ వార్స్‌ ఎక్కువైతే ఇబ్బంది. అయినా ఇద్దరు హీరోలు కలసి మెలసి ఉంటే, ఫ్యాన్స్‌ ఇలా కొట్టుకోవడం మంచిది కాదు. అంతా ఇలానే ఉన్నారా అంటే కాదనే చెప్పాలి. ఒకరి నటనను మరొకరి ఫ్యాన్స్‌ మెచ్చుకుంటున్న ఫ్యాన్స్‌, ట్వీట్స్‌ కూడా ఉన్నాయి. కానీ ఒక్క పెరుగు చుక్క చాలు కదా పాలు విరగొట్టడానికి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus