ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్, తారక్ కోరుకున్న విజయం దక్కింది. పాన్ ఇండియా సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కావడంతో పాటు పాన్ ఇండియా హిట్ సాధించాలన్న చరణ్, తారక్ కల ఈ సినిమాతో నెరవేరింది. ఆర్ఆర్ఆర్ లో నటించడం ద్వారా ఇద్దరు హీరోలకు పాపులారిటీ పెరిగింది. ఫలితంగా ఈ హీరోల రెమ్యునరేషన్లతో పాటు తర్వాత సినిమాల బడ్జెట్లు కూడా పెరుగుతున్నాయి. అయితే ఈ స్టార్ హీరోలు తర్వాత సినిమాల విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే ఈ స్టార్ హీరోల తరువాత ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు హైదరాబాద్ లో శనివారం బుకింగ్స్ బాగానే ఉన్నాయి. గని సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోవడంతో మరో వారం ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్లకు ఢోకా లేనట్టేనని చెప్పవచ్చు. ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోయినా ఆ సినిమా తర్వాత స్థానంలో మాత్రం ఆర్ఆర్ఆర్ నిలవనుంది.
కలెక్షన్లపరంగా దేశంలో టాప్ 10 సినిమాలలో విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన 4 సినిమాలు ఉన్నాయి. చరణ్, తారక్ తర్వాత సినిమాలకు బాలీవుడ్ లో, ఇతర భాషల్లో రిలీజ్ కు ముందు కాకుండా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ప్రమోషన్స్ జరిగేలా చేస్తే సినిమాకు బెనిఫిట్ కలుగుతుంది. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలను ఎంచుకోవడంతో పాటు ఇతర భాషల నటీనటులకు ప్రాధాన్యత సినిమాలలో ఇస్తే మరీ మంచిది.
కథకు అనుగుణంగానే బడ్జెట్ ను ఖర్చు చేయాలే తప్ప అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి సినిమా బడ్జెట్ పెరిగే ఛాన్స్ ఉంటే జాగ్రత్త పడాలి. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ విషయంలో అనుసరించిన విధానాన్నే తర్వాత సినిమాలకు కూడా అనుసరిస్తే మంచిది. కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూనే చరణ్, తారక్ కొత్త తరహా కథలను ఎంచుకుంటే సినిమాకు ప్రయోజనం చేకూరుతుంది. చరణ్, తారక్ ఈ జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!