ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయనున్న సందీప్ రెడ్డి వంగా.. ?

టాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ లాంటి గేమ్ ఛేంజింగ్ మూవీ తీసి సంచలనం సృష్టించాడు. ఈ చిత్రం కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితి కాకుండా ఇప్పుడు కోలీవుడ్ , బాలీవుడ్ లో కూడా రీమేక్ చేస్తుండడం విశేషం. ‘అర్జున్ రెడ్డి’ ని కోలీవుడ్ లో ‘వర్మ’ పేరుతో డైరెక్టర్ బాలా తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో సందీప్ రెడ్డి వంగనే… డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ చిత్రం తరువాత సందీప్.. మహేష్ బాబు తో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మించబోతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా… తాజాగా సందీప్ రెడ్డి వంగా ఎన్టీఆర్ ని కలిసి ఓ లైన్ వినిపించాడని సమాచారం. ఈ మధ్య ఓ ఫంక్షన్ లో ఎన్టీఆర్ ను కలుసుకున్న సందీప్ … ఒక లైన్ చెప్పాడని తెలుస్తోంది. విన్న లైన్ నచ్చడంతో .. పూర్తి కథ సిద్ధం చేసుకుని రమ్మని ఎన్టీఆర్ కు చెప్పినట్టుగా ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది. పక్కా మాస్, యాక్షన్ తో కూడుకున్న ప్రేమకథ అని టాక్. ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని సందీప్ ఈ కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడట. మరి తన కథతో.. ఈ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ ఎన్టీఆర్ ను ఎంత వరకూ మెప్పిస్తాడనేది చూడాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus