Nayanthara: నయనతారకు కవలలు పుడతారని తారక్ ఆనాడే చెప్పారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార కవలలకు జన్మనిచ్చారనే వార్త చాలామందిని షాక్ కు గురి చేసింది. పెళ్లైన నాలుగు నెలలకే నయనతార కవలలకు జన్మనివ్వడం ఏమిటని మరి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత సరోగసి ద్వారా నయనతార పిల్లలకు జన్మనిచ్చారని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆ పిల్లలకు ఉయిర్, ఉలగమ్ అని పేర్లు పెట్టడం గమనార్హం.

అయితే నయనతార తల్లి కావడంతో సోషల్ మీడియాలో అదుర్స్ మూవీలో చారి పాత్రలో తారక్ నయనతార జాతకం గురించి చెప్పిన విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. చారి పాత్రలో తారక్ పుట్టుమచ్చల గురించి చెబుతూ మీకు కవలపిల్లలు పుడతారని నయనతారకు చెబుతాడు. అయితే చారి పాత్రలో తారక్ నయనతార విషయంలో చెప్పిందే నిజమైందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇందుకు సంబంధించిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయనతార తల్లి కావడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. గతంతో పోల్చి చూస్తే నయనతార సినిమాల సంఖ్యను తగ్గించే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం. పెళ్లి తర్వాత నయనతార కొత్తగా ఏ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నయనతార తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో సక్సెస్ ను అందుకున్నారు. గాడ్ ఫాదర్ సినిమా విజయానికి చిత్రబృందం కారణమని ఆమె వెల్లడించారు. చిరంజీవి గొప్ప నటుడే కాదని గొప్ప వ్యక్తి అని ఆమె తెలిపారు. ఇటు కెరీర్ పరంగా అటు వ్యక్తిగత జీవితంలో నయనతారకు అనుకూలంగా జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. మరోవైపు నయనతార ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సైతం విజయాలను అందుకుంటూ ఉండటంతో నయనతారకు ఈ స్థాయిలో పారితోషికం దక్కుతోందని తెలుస్తోంది. నయనతార తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus