Jr NTR: టాలీవుడ్లో అసాధ్యం అనుకున్న రికార్డుని సాధించిన ఎన్టీఆర్..!

ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో ‘రౌద్రం రణం రుధిరం'(ఆర్.ఆర్.ఆర్) అనే భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అతను కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్నాడు. అతని పాత్రకు సంబంధించిన టీజర్ గతేడాది చివర్లో విడుదలైన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది ఈ టీజర్. అంతేకాదు టాలీవుడ్లో అసాధ్యం అనుకున్న రికార్డుని సైతం ఎన్టీఆర్ ఈ టీజర్ తో సాధించాడు. వివరాల్లోకి వెళితే.. ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ దసరా కానుకగా విడుదలైంది.

యూట్యూబ్లో 50 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసిన మొట్టమొదటి టాలీవుడ్ టీజర్‌గా రికార్డులు సృష్టించింది ఈ భీమ్ టీజర్. అంతేకాకుండా 1.3 మిలియన్ లైక్స్ కూడా పడ్డాయి ఈ టీజర్ కు.! గతంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పేర్ల పై ఆల్ టైం రికార్డులు ఉండేవి. కానీ ఎన్టీఆర్ వాటిని బ్రేక్ చేసాడు. ఇక ఎన్టీఆర్ తరువాత అత్యధిక వ్యూస్ మరియు లైక్ లను సాధించిన టీజర్ గా అల్లు అర్జున్- సుకుమార్ ల ‘పుష్ప’ నిలిచింది.

ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ తో మరో స్టార్ హీరో రాంచరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతను అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తానని యూనిట్ సభ్యులు ప్రకటించారు కానీ.. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వలన మళ్ళీ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని భోగట్టా..!


‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus