Jr NTR: ఆర్ఆర్ఆర్ నుంచి తారక్ లుక్ లీక్.. కానీ?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుంచి టీజర్లు, గ్లింప్స్ విడుదలైనా వాటిలో పూర్తిస్థాయిలో కొమురం భీమ్ లుక్ లో తారక్ ను చూపించలేదు. అయితే కొమురం భీమ్ లుక్ లో తారక్ దిగిన ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తుపాకీ తగిలించుకుని రుమాలు కట్టుకుని తారక్ కొమురం భీమ్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో పుష్ప, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ సినిమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ కాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఫోటోలు కూడా లీకవుతూ ఉండటం గమనార్హం. భారీ బడ్జెట్ తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. భీమ్ లుక్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదుర్స్ అనేలా ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు మన దేశంలోని ప్రముఖ భాషల్లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది.

రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. రాజమౌళి బాహుబలి2 సినిమాను మించిన విజువల్ ఎఫెక్ట్స్ తో ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించారని తెలుస్తోంది. 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ 1,000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజమౌళి ఈ సినిమాతో దేశంలోనే నంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus