Jr NTR: తారక్ ను మెప్పించిన స్టార్ డైరెక్టర్ ఇతనే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన క్రేజ్, పాపులారిటీ తర్వాత సినిమాలతో మరింత పెరిగేలా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తారక్ రాజమౌళి కాంబినేషన్ లో 4 సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా తారక్ అంటే నాకు అభిమానం అని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్ లో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. తారక్ వెట్రిమారన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని కొన్నిరోజుల క్రితం వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. వెట్రిమారన్ సినిమాలలో ఉండే రా నెస్ నాకు ఎంతగానో నచ్చుతుందని తారక్ కామెంట్లు చేశారు. వెట్రిమారన్ స్థాయిలో మరే డైరెక్టర్ రా నెస్ ను ఆవిష్కరించలేరని తారక్ చెప్పుకొచ్చారు. వెట్రిమారన్ సినిమాలకు తాను ఫ్యాన్ అయిపోయానని ఆయన కామెంట్లు చేశారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో వెట్రిమారన్ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. జూనియర్ ఎన్టీఆర్ వెట్రిమారన్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో సినిమా తెరకెక్కుతుందేమో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఎన్టీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళితో సినిమాలు చేయాలని అందరు హీరోలు ఆశ పడుతుంటే కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వెట్రిమారన్ తో పని చేయాలని హీరోలు ఆశపడుతున్నారు. వెట్రిమారన్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో వెట్రిమారన్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు వెట్రిమారన్ కు పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus