Jr NTR: అలాంటివేమీ పెట్టుకోకూడదు స్ట్రిక్ట్ గా కండీషన్ పెట్టిన తారక్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కొరటాల శివకు ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి పరాజయం లేకుండా ఇండస్ట్రీలో కొనసాగారు.అయితే కొరటాల శివ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ఎదుర్కొన్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు.అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా స్క్రిప్టు విషయంలో ఎన్టీఆర్ పలు జాగ్రత్తలు సూచించినట్లు సమాచారం. ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉండటం వల్ల క్లైమాక్స్ సన్నివేశాన్ని రీ రైట్ చేస్తున్నారు. ఇప్పటికే క్లైమాక్స్ విషయంలో తారక్ ఎన్టీఆర్ కు కొన్ని సూచనలు చేశారట.

అదే విధంగా ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కొరటాల శివకు పలు కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రొడక్షన్, బిజినెస్ విషయంలో గానీ మరే విషయంలో కానీ కొరటాల శివ ఇన్వాల్వ్ కాకూడదని ఎన్టీఆర్ కొరటాల శివకు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమా విషయంలో కొరటాల అన్నీ దగ్గరుండి చూసుకోవడం వల్లే ఈయన సినిమాపై శ్రద్ధ చూపలేక పోయారని అందుకే ఈ సినిమా అలాంటి ఫలితాన్ని అందుకుందనే వార్తలు వస్తున్నాయి.

అందుకే ఎన్టీఆర్ సినిమా విషయంలో అలాంటివి జరగకూడదని ఎన్టీఆర్ కొరటాలకు కండిషన్ పెట్టి, పూర్తిగా తన దృష్టిని సినిమా పై పెట్టాలని సూచించారట. ఇక ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉండటం వల్ల ఈ సినిమా మరి కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus