Jr NTR: ఆ రీజన్ వల్లే తారక్ సైలెంట్ గా ఉన్నారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ ఎప్పుడనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరకడం లేదనే సంగతి తెలిసిందే. ఆగష్టు అని సెప్టెంబర్ అని ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ సైతం ఇప్పటివరకు ఫైనల్ కాలేదు. అయితే తారక్ మాత్రం ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైనా పరవాలేదని భావిస్తున్నారు. తారక్ ఇలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉండటానికి ముఖ్యమైన కారణం ఉంది.

కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమా వల్ల ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పలు ఏరియాలకు సంబంధించి ఆచార్య సినిమా నష్టాలను కొరటాల శివ భర్తీ చేయాల్సి ఉంది. ఇలాంటి సమయంలో కొరటాల శివపై ఒత్తిడి పెరిగితే తన సినిమా ఫలితంపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.కొరటాల శివకు ఆచార్య సినిమాకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయి తన సినిమా స్క్రిప్ట్ అనుకున్న విధంగా వచ్చే వరకు షూటింగ్ ఆలస్యమైనా పరవాలేదని తారక్ భావిస్తున్నారని తెలుస్తోంది.

ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలుకావడంతో షూటింగ్ మొదలైన తర్వాత వీలైనంత తక్కువ సమయంలోనే సినిమాల షూటింగ్ జరిగేలా తారక్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. తారక్ తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా తమ మద్దతు ఉంటుందని ఫ్యాన్స్ పరోక్షంగా చెప్పకనే చెబుతున్నారు.

సినిమాసినిమాకు తారక్ రేంజ్, క్రేజ్ పెరుగుతుండగా ఆర్ఆర్ఆర్ తర్వాత నటించే సినిమాలు కూడా భారీగానే ఉండేలా తారక్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాకు ఒక నిర్మాత కావడంతో లాభాల్లో వాటా తీసుకోవాలని తారక్ ఫిక్స్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అన్న కెరీర్ కోసం తారక్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus