Jr NTR: భార్యపై ప్రేమను చాటుకున్న ఎన్టీఆర్.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి జోడీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. తారక్ కెరీర్ పరంగా భారీ విజయాలను అందుకోవడంలో లక్ష్మీ ప్రణతి పాత్ర కూడా కొంతమేర ఉందని తారక్ అభిమానులు భావిస్తారు. లక్ష్మీ ప్రణతి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా తారక్ నటించిన సినిమాలను మాత్రం బాగానే ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా తారక్ లక్ష్మీ ప్రణతికి ఖరీదైన బహుమతిని ఇచ్చారని సమాచారం. ఆరున్నర ఎకరాల ఫామ్ హౌస్ ను తారక్ భార్యకు బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది.

భార్యాపిల్లలకు తారక్ ఎంతగానో ప్రాధాన్యతనిస్తారు. కొన్ని నెలల క్రితం తారక్ గోపాలపురం పరిధిలో ఉన్న ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిలో తారక్ ఫామ్ హౌస్ ను నిర్మించారు. లక్ష్మీప్రణతి పుట్టినరోజు సందర్భంగా తారక్ ఆ భూమిని ప్రణతికి ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు భార్యపై తారక్ కు ఎంత ప్రేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. బృందావనం అనే పేరుతో తారక్ ఆ ఫామ్ హౌస్ ను నిర్మించారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ కెరీర్ లోని హిట్ సినిమాలలో బృందావనం ఒకటి కాగా ఆ సినిమా పేరునే ఫామ్ హౌస్ పేరుగా తారక్ ఫిక్స్ చేయడం గమనార్హం. తారక్ ఇచ్చిన గిఫ్ట్ వల్ల లక్ష్మీ ప్రణతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది. మరోవైపు కొరటాల శివ సినిమా కోసం తారక్ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నారు.

తారక్ కొత్త లుక్ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. సెప్టెంబర్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. 2023 సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus