‘దేవర’ (Devara) సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన కొత్తల్లో, ఆ తర్వాత కొన్ని నెలలకు వచ్చిన కామన్ వార్త. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, తెలుగు దేశం పార్టీని బాగా ఇబ్బంది పెట్టిన ఓ అంశం చూపించబోతున్నారు అని. అయితే ఆ తర్వాత పెద్దగా ఎక్కడా ఆ విషయం గురించి చర్చ జరగలేదు. అయితే సినిమా కాన్సెప్ట్, ప్రచార చిత్రాల్లో చూపిస్తున్న విధానం చూస్తుంటే.. కచ్చితంగా అప్పుడు వచ్చిన పుకార్లే నిజమవుతాయి అని అంటున్నారు.
సెప్టెంబర్ 27న ‘దేవర’ (Devara) సినిమాను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. తొలి పార్టు ఆ రోజు వస్తున్న నేపథ్యంలో సినిమా గురించి కొన్ని కథనాలు బయటకు వచ్చాయి. సినిమా ఎలా ఉండబోతోంది, ఏ అంశం చుట్టూ కథ తిరుగుతుంది అనే విషయం గురించి వినిపిస్తున్న వార్తల్ని సమప్ చేస్తే.. ఇది ప్రస్తుతం ఆంధ్రలో అధికారంలో ఉన్న పార్టీని కార్నర్ చేసేలా ఉన్నాయి అంటున్నారు. 1985 సమయంలో ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామంలో ఆరుగురు దళితులు హత్యకు గురయ్యారు.
అది అగ్ర వర్ణాల పనే అని అప్పట్లో మాటలు వినిపించాయి. నీటిని వాడుకునే విషయంలో మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ప్రాణాలు పోయే వరకు వచ్చింది. అంతేకాదు అదే సమయంలో ముగ్గురు మహిళలు మానభంగానికి గురయ్యారు. దీంతో కారంచేడు భగ్గుమంది. సుమారు 40 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన అప్పట్లో హాట్ టాపిక్. అయితే ఈ ఘటనల తర్వాత దుర్ఘటనకు కారణమైన ఒకరిద్దరికి నక్సలైట్లు మరణ శిక్ష అప్పట్లో వార్తలు వచ్చాయి.
దీంతో ఈ విషయం రాజకీయంగానూ దుమారం రేపింది. అంతేకాదు తెలుగుదేశం సర్కారుని ఈ విషయం ఆ రోజుల్లో ఇబ్బందుల్లోకి నెట్టింది కూడా. ఈ సమయంలో ఆ అంశం నేపథ్యంలో సినిమా అంటే.. తేనె తుట్టె కదపడమే అంటున్నారు. ఆ ఘటన పేరు ఎత్తకుండా వేరే పేరుతో చూపించినా, ఆ విషయయం ప్రస్తావనకు రావడం అంత సరికాదు. అసలే ఏపీలో ఉన్న ప్రభుత్వానికి, ఎన్టీఆర్‌కు (Jr NTR) అంతటి మంచి సంబంధాలు లేవు అని బయట టాక్.