Jr NTR: వార్2 విషయంలో అలా చేయడం నచ్చదని తారక్ క్లారిటీ ఇచ్చేశారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాల కోసం ఎంత కష్టపడతారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ వార్2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ను డూప్స్ తో తెరకెక్కిస్తున్నారని కొన్నిరోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చెక్ పెట్టారు. వార్2 సినిమాలోని యాక్షన్ సీన్స్ లో తారక్ పాల్గొననున్నారని తెలుస్తోంది. ఎంత రిస్కీ సీన్ అయినా నేనే చేస్తానని డూప్స్ అవసరం లేదని క్లారిటీ ఇచ్చేశారని తెలుస్తోంది.

వార్2 షూటింగ్ త్వరలో మొదలు కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. వార్2 సినిమా సక్సెస్ సాధిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అవుతానని తారక్ ఫీలవుతున్నారని భోగట్టా. వార్2 సినిమాలో తారక్ రోల్ కు బాగానే ప్రాధాన్యత ఉంటుందని తగిన ప్రాధాన్యత ఉండటం వల్లే తారక్ ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారని సమాచారం.

హృతిక్, తారక్ ఈ సినిమాలో స్నేహితులుగా కనిపిస్తారో శత్రువులుగా కనిపిస్తారో స్పష్టత రావాల్సి ఉంది. వార్2 సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. వార్2 సినిమా చెప్పిన తేదీకి కచ్చితంగా విడుదలవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వార్2 సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వార్2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నెటిజన్లు చెబుతున్నారు.

ఈ సినిమా రిలీజ్ తర్వాత సంచలనాలు సృష్టించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వార్2 సినిమా కోసం ఎన్టీఆర్ కు భారీ స్థాయిలోనే పారితోషికం దక్కిందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇతర భాషల్లో సైతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ పెరుగుతోంది.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus