యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇరవై ఏళ్ళప్పుడే అధిక సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఆ సంఖ్య “ఆది” సినిమా నుంచి “నాన్నకు ప్రేమతో” వరకు రోజురోజుకు పెరుగుతోంది. ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇస్తారు. కాస్త సమయం చిక్కినా అభిమానుల్ని కలుసుకునేందుకు ఇష్టపడుతారు. ప్రస్తుతం యంగ్ టైగర్ జనతా గ్యారేజ్ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
అమీర్ పేట్ లోని సారధి స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో రాత్రి పూట కూడా చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్ గ్యాప్ లో ఎన్టీఆర్ తన అభిమానులతో మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలిసి హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాలోని నందమూరి అభిమానులు పెద్దఎత్తున గురువారం స్టూడియోకి చేరుకున్నారు. వచ్చిన వారందిరి కోసం ఎన్టీఆర్ టైం కేటాయించారు. ప్రేమలో తాత నందమూరి తారక రామరావుని గుర్తు చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ అభిమానులందరికీ నచ్చుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.