Posani: అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ పోసాని.. మీకు అర్థమవుతోందా?

ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అయినా జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఒకటే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే సందర్భం ఏదైనా పోసాని కృష్ణమురళి కామెంట్లపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ పోసాని అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తుండటం గమనార్హం. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఏం సాధించాలని అనుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

జూనియర్ ఆర్టిస్టులను జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చడం ఏంటని మండిపడుతున్నారు. పోసాని అభిమానించే వాళ్లను కూడా అలా పోల్చి కామెంట్లు చేస్తే ఆయన సైలెంట్ గా ఉంటారా అని నందమూరి ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రాస కోసం కామెంట్లు చేసి వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఫ్యాన్స్ చెబుతున్నారు. పోసాని ఇలాంటి కామెంట్ల వల్ల తన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ గా ఉన్నా తాము సైలెంట్ గా ఉండబోమని అభిమానులు చెబుతున్నారు. బ్యాగ్రౌండ్ ఉన్నా ఎంతో కష్టపడి తారక్ ఈ స్థాయికి చేరుకున్నాడని పదేపదే తారక్ ప్రస్తావన తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా పోసాని అంటే ఎంతో అభిమానం ఉందని అయితే ఆయన చేస్తున్న కొన్ని పనుల వల్ల ఆయనపై అభిమానం తగ్గుతోందని మరి కొందరు చెబుతున్నారు.

పోసాని (Posani) ఇలాంటి కామెంట్లు చేయడం వల్లే ఆయనకు సినిమా ఆఫర్లు తగ్గుతున్నాయని మరి కొందరు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పై మాత్రమే దృష్టి పెడుతుండగా ఇలాంటి కామెంట్ల వల్ల ఆయన హర్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఎన్టీఆర్ బిజీ అవుతున్నారు. ప్రతి సినిమా రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కేలా ఎన్టీఆర్ ప్లానింగ్ ఉంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus