NTR,Kalyan Ram: ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ కు కళ్యాణ్ రామ్ తెర దించుతారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎలాంటి అప్డేట్ రాలేదనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా ఆ సినిమా కోసం తారక్ మూడున్నరేళ్ల సమయం కేటాయించడం పట్ల ఫ్యాన్స్ లో ఒకింత అసంతృప్తి ఉంది. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను అయినా వేగంగా మొదలుపెడితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. 15 నెలల క్రితం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వెలువడగా ఇప్పటివరకు

ఈ సినిమాలో నటించే హీరోయిన్ కూడా ఫైనల్ కాలేదంటే మేకర్స్ నిర్లక్ష్యమే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్30 సినిమాకు కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నెల 4వ తేదీన బింబిసార మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.

బింబిసార ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్30 గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్ డేట్ ఆయనకు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎన్టీఆర్30 గురించి కళ్యాణ్ రామ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. మల్లిడి వశిష్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఫలితంపై కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus