యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు 2023 సంవత్సరం జూన్ నాటికి పూర్తవుతాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే తారక్ కు మాత్రం రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తాజాగా రిలీజ్ చేసిన వీడియో ద్వారా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఎన్టీఆర్ సాధారణంగా స్పందించారే తప్ప టీడీపీకి అనుకూలంగా వైసీపీని వ్యతిరేకిస్తూ ఎక్కడా కామెంట్లు చేయలేదు. మరోవైపు సినిమాల్లో సక్సెస్ సాధించిన హీరోలు రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా సక్సెస్ సాధించడం లేదు. తారక్ రాజకీయాలపై ఆసక్తి చూపకపోవడానికి ఇది కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఎన్టీఆర్ తాను పాల్గొనే ఇంటర్వ్యూలలో సైతం రాజకీయాల గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు. అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆ పార్టీకి పునర్వైభవం వస్తుందని చాలామంది నమ్ముతున్నారు.
రామోజీరావు కూడా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ కావాలని కోరడంతో పాటు రాజకీయాల గురించి ఎన్టీఆర్ తో చర్చించారని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోల రేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్లు ఖాతాలో వేసుకుంటే నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంటారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా తర్వాత సినిమా రివేంజ్ డ్రామాగా తెరకెక్కనుందని తెలుస్తోంది.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!